![]() |
![]() |

2024 సంక్రాంతి బరి నుంచి 'ఫ్యామిలీ స్టార్' తప్పుకుందని ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలు నిజమేనని, సంక్రాంతి పోరు నుంచి ఫ్యామిలీ స్టార్ నిజంగానే తప్పుకుందని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా ఏకంగా వేసవికి వాయిదా పడినట్లు సమాచారం.
సంక్రాంతి సీజన్ పై పలు సినిమాలు కర్చీఫ్ వేశాయి. పొంగల్ పోరుకి సిద్ధమంటూ ఇప్పటికే 'గుంటూరు కారం', 'హనుమాన్', 'ఈగల్', 'ఫ్యామిలీ స్టార్', 'సైంధవ్', 'నా సామి రంగ' వంటి చిత్రాలు ప్రకటించాయి. అయితే వీటిలో చివరికి నిలిచే సినిమాలు ఎన్నో అనే అనుమానం అందరిలో ఉంది. అందుకు తగ్గట్టుగానే 'ఫ్యామిలీ స్టార్' తప్పుకుంది.
'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. 'గీత గోవిందం' కాంబోలో వస్తున్న సినిమా కావడంతో 'ఫ్యామిలీ స్టార్'పై మంచి అంచనాలే ఉన్నాయి.
'ఫ్యామిలీ స్టార్' చిత్రాన్ని ముందు నుంచి సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. ఓ నెలన్నర క్రితం 50 శాతం షూటింగ్ పూర్తయిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే మూడు నెలల్లోనే మిగతా సగం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయ్యి నిజంగా సంక్రాంతికి విడుదలవుతుందా? అనే అనుమానాలు అప్పుడే వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఆ అనుమానాలే నిజమయ్యాయి. విడుదలకు ఇంకా రెండు నెలలు కూడా సమయం లేదు. ఇంకా దాదాపు 25 శాతం షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. ఓ వైపు షూటింగ్, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో మూవీ టీమ్ ఎంత పరుగులు పెట్టినా సంక్రాంతికి రావడం అసాధ్యం. అందుకే సినిమాని వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. మార్చి ద్వితీయార్థంలో ఫ్యామిలీ స్టార్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
![]() |
![]() |