![]() |
![]() |

ప్రస్తుతం ఇండియాలో రూపొందుతోన్న మోస్ట్ అవైటెడ్ సినిమాలలో జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ప్రాజెక్ట్ ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇటీవల ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. మొదట ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రెండో షెడ్యూల్ నుంచి ఎన్టీఆర్ పాల్గొననున్నాడు. ఇప్పటికే 'డ్రాగన్'పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ చేసిన కామెంట్స్, ఆ అంచనాలను ఆకాశాన్నంటేలా చేశాయి. (Jr NTR Dragon)
తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' ఇటీవల విడుదలై, ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ టీం నిర్వహించిన సక్సెస్ ప్రెస్ మీట్ లో నిర్మాత రవిశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఎన్టీఆర్-నీల్ క్రేజీ ప్రాజెక్ట్ 'డ్రాగన్'కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. "పుష్ప-2 రూ.1800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. నెక్స్ట్ మీరు చేయబోతున్న భారీ ప్రాజెక్ట్ 'డ్రాగన్' ఎలా ఉండబోతుంది?" అనే ప్రశ్నకు రవిశంకర్ బదులిస్తూ "ఇండియన్ స్క్రీన్ పై చూడని వన్ ఆఫ్ ది యూనిక్ స్క్రిప్ట్ చూడబోతున్నారు. ఆకాశమే దానికి హద్దు. మీరు ఊహించిన దానికంటే చాలా చాలా ఎక్కువ కలెక్షన్స్ రాబడుతుందని కాన్ఫిడెంట్ గా చెప్పగలను. హై వోల్టేజ్ యాక్షన్ తో కూడిన సినిమా ఇది. వేరే లెవెల్ లో ఉంటుంది. ఇంటర్నేషనల్ వైడ్ గా రిలీజ్ చేస్తాం." అన్నారు.
![]() |
![]() |