![]() |
![]() |

`భీష్మ`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన నితిన్.. మరింత ఉత్సాహాంతో వరుస చిత్రాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ ఏడాది ప్రథమార్ధంలో ఏకంగా మూడు సినిమాలతో పలకరించబోతున్నాడు నితిన్. ఫిబ్రవరి 26న `చెక్`, మార్చి 26న `రంగ్ దే`, జూన్ 11న `అంధాధున్` రీమేక్.. ఇలా నాలుగు నెలల్లోపే మూడు చిత్రాలతో సందడి చేయనున్నాడు. `చెక్`, `రంగ్ దే` విడుదలకు సిద్ధం కాగా.. `అంధాదున్` రీమేక్ ఏప్రిల్ చివరి కల్లా చిత్రీకరణ పూర్తిచేసుకోనుంది.
కాగా, మే నుంచి కొత్త చిత్రం షురూ చేసే దిశగా నితిన్ అడుగులేస్తున్నాడని టాక్. రెండేళ్ళుగా వార్తల్లో ఉన్న `పవర్ పేట`నే ఈ యంగ్ హీరో నెక్స్ట్ వెంచర్ గా పట్టాలెక్కనుంది. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేయనున్న ఈ మాస్ ఎంటర్ టైనర్.. రెండు భాగాలుగా నిర్మాణం జరుపుకోనుందని వినికిడి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
మరి.. రాబోయే చిత్రాలతో నితిన్ ఎలాంటి ఫలితాలను అందుకుంటాడో చూడాలి.
![]() |
![]() |