![]() |
![]() |

మార్చి 9 న 'చావు కబురు చల్లగా' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా అటెండయ్యాడు. ఒక అభిమాని స్టేజ్ పైకి దూసుకెళ్లి ఆయనతో ఫోటో తీసుకోవడానికి ప్రయత్నించాడు. బౌన్సర్లు అతన్ని ఆపడానికి ప్రయత్నించినప్పుడు, అల్లు అర్జున్ వారిని వెనక్కి వెళ్లమని కోరాడు. ఆ అభిమానితో ఫొటో దిగాడు. బన్నీ ఈ ప్రవర్తన మరోసారి ఆయన అభిమానుల ప్రేమను గెలుచుకుంది. 'చావు కబురు చల్లగా' టీమ్ గురించి గొప్పగా మాట్లాడాడు బన్నీ.
అల్లు అర్జున్‌కు తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా విపరీతంగా అభిమానులు ఉన్నారు. 'చావు కబురు చల్లగా' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ఉద్వేగభరితంగా మాట్లాడుతుండగా, ఒక వీరాభిమాని స్టేజ్ మీదకు వెళ్లి, అల్లు అర్జున్‌ను కౌగిలించుకుని, ఆయనతో ఫోటో తీసుకోవాలనే కోరికను వ్యక్తం చేశాడు.
స్టేజ్ మీదున్న బౌన్సర్లు ఆ అభిమానిని ఆపేందుకు ట్రై చేశారు. అతడ్ని స్టేజ్ మీద నుంచి లాగడం మొదలుపెట్టారు. ఆ టైమ్‌లో బన్నీ, "అతన్ని వదిలేయండి, అతను కేవలం అభిమాని. అతన్ని ఫొటో తీసుకోనివ్వండి" అని అన్నాడు. ఆ తర్వాత ఫొటోకు పోజులిచ్చి స్టేజి నుంచి దిగమని అభిమానిని కోరాడు.
తన ప్రసంగంలో 'పుష్ప' మూవీ అప్‌డేట్ కూడా ఇచ్చాడు అల్లు అర్జున్. "నేను మాట్లాడటం మొదలుపెట్టినప్పటి నుండి మీరు పుష్ప గురించి అడుగుతున్నారు. ఈ కార్యక్రమంలో ఇది నా చివరి మాట అవుతుంది. 'పుష్ప' తగ్గేది లే." అన్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. కేరళలో ఇటీవల ఓ షెడ్యూల్ జరుపుకున్న ఈ మూవీ షూటింగ్ త్వరలో కొనసాగనుంది.
ఎర్రచందనం స్మగ్లర్ల జీవితాలను స్పృశిస్తూ తీస్తున్న 'పుష్ప' మూవీ ఆగస్ట్ 13న విడుదల కానున్నది.

![]() |
![]() |