Home  »  News  »  యశ్ రియల్ స్టోరీ: సెట్‌లో టీలు ఇచ్చిన కుర్రాడు.. నేడు పాన్ ఇండియా స్టార్.!

Updated : Aug 26, 2026

రాకింగ్ స్టార్ యశ్ అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించే పాన్ ఇండియా సూపర్ స్టార్. కానీ ఆయన సక్సెస్ వెనుక ఉన్న అసలైన పోరాటం చాలామందికి తెలియదు. ఈ పాన్ ఇండియా స్టార్ ఒకప్పుడు టీలు కూడా అందించాడు.

యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. నాన్న అరుణ్ కుమార్ బెంగళూరులో BMTC బస్సు డ్రైవర్‌గా పనిచేసేవారు. అమ్మ పుష్ప గృహిణి. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నవీన్‌కి చిన్నప్పటి నుంచే నటన అంటే పిచ్చి. డిగ్రీ మధ్యలోనే ఆపేసి, సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మొదట్లో అవకాశాలు రాకపోవడంతో రంగస్థల నటుల దగ్గర టీలు అందించే పనిలో చేరాడు. రోజుకి వచ్చే 50 రూపాయల సంపాదనతో కడుపు నింపుకుంటూ.. నాటకాల వెనుక ఉండే కష్టాలను పాఠాలుగా నేర్చుకున్నాడు.

ఒకానొక దశలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరితే రెండు రోజులకే ఆ సినిమా ఆగిపోయింది. అయినా వెనుకాడలేదు. చిన్న చిన్న నాటకాల్లో నటుడిగా అవకాశాలు దక్కించుకుంటూ తన టాలెంట్ నిరూపించుకున్నాడు. 2004లో 'ఉత్తరాయణ', 'నంద గోకుల' లాంటి టీవీ సీరియల్స్ ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యాడు. ఆ సమయంలో టీవీ నటులకు సినిమాల్లో పెద్దగా స్కోప్ ఉండదనే ముద్రను యశ్ తన కష్టంతో చెరిపివేశాడు.

2007లో 'జంబద హుడుగి' సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చి, 'మొగ్గిన మనసు' చిత్రానికి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకున్నాడు. ఆ తర్వాత 'గూగ్లీ', 'మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి' లాంటి బ్లాక్‌బస్టర్‌లతో కన్నడ నాట స్టార్ గా ఎదిగాడు.

ఇక అక్కడ నుంచి మొదలైంది అసలైన విశ్వరూపం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన 'కేజీఎఫ్' సినిమాలతో బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల సునామీ సృష్టించి, కన్నడ ఇండస్ట్రీ రేంజ్‌ను పాన్ ఇండియా లెవెల్‌కి తీసుకెళ్లాడు. ఒకప్పుడు సెట్స్‌లో టీలు మోసిన అదే చేతులతో, ఈరోజు పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను ఏలుతున్నాడు యశ్. 

కలలు కనడానికి పేదరికం అడ్డుకాదని, కష్టపడితే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన యశ్ లైఫ్ జర్నీ ప్రతి ఒక్కరికీ ఓ గ్రేట్ ఇన్స్పిరేషన్.

 

 

 

Rocking Star Yash, Life Story, Toxic Movie

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.