Home  »  News  »  Toxic: నో డౌట్.. టాక్సిక్ ని తెరకెక్కించింది అందుకోసమే

Updated : Aug 8, 2026

 

కొన్ని నిమిషాల క్రితం యష్ వన్ మాన్ సునామి 'టాక్సిక్' ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అభిమానులు, ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ బాగానే వస్తుంది. అదే టైంలో ఆ అందరు ఆశ్చర్యానికి గురయ్యే విషయం ఏంటంటే టాక్సిక్ ప్రతి ఫ్రేమ్ మైండ్ బ్లోయింగ్ గా ఉండటంతో పాటు టేకింగ్ పరంగా కూడా ఎంతో విభిన్నంగా దూసుకుపోతూ ఉంది. ఇంకా చెప్పాలంటే హాలీవుడ్ సినిమాని మనముందు ఉంచిందని చెప్పవచ్చు. దీంతో సౌత్ ఇండియన్ సినిమా  అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త చరిత్రను తిరగరాస్తుందా అనే చర్చలు మొదలయ్యాయి.


అసలు ఇలాంటి సినిమాని తెరకెక్కించాలంటే హీరో, దర్శకుడు, నిర్మాతకి ఎన్నో గట్స్ ఉండాలి. గట్స్ అనే మాట కూడా చాలా తక్కువ.  కెవిఎన్ ప్రొడక్షన్స్, మ్యాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యశ్ మునుపెన్నడూ చూడని విభిన్నమైన ద్విపాత్రాభినయంలో మెరవనున్నారు. 'రాయ' అనే శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఆయన రగ్గడ్ లుక్, స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు, రక్తం సిందే పోరాట ఘట్టాలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అంతకుముందు విడుదలైన గ్లింప్స్ కేవలం 24 గంటల్లోనే 200 మిలియన్లకు పైగా వీక్షణలు మరియు 5.5 మిలియన్ల లైక్స్‌ సాధించి సోషల్ మీడియా రికార్డులను తిరగరాయడం, ఈ సినిమాపై ఉన్న అంతర్జాతీయ క్రేజ్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది. 


Also read: Toxic: టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది.. ఏదో జరగబోతుందనేది పక్కా


 కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి అగ్ర హీరోయిన్స్  కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే టాక్సిక్ భారతీయ సినిమా గొప్పతనాన్ని ప్రపంచ సినిమాకి తెలియచేయబోతుందని. కాబట్టి ఆగస్టు 26 న టాక్సిక్ కి పోటీగా రావాలని అనుకునే వాళ్ళు కనీసం మనసులో కూడా ఆ ఆలోచన రానీయకండి. మధ్య పానం, ధూమపానం ఎలా అయితే ఆరోగ్యానికి హానికరమో, టాక్సిక్ కి పోటీ రావడం కూడా హానికరమే.

Toxic, Yash, Kaira Adwani, Nayanthara






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.