![]() |
![]() |

'దసరా' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'ది ప్యారడైజ్'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV Cinemas) బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా అఫిషియల్ టీజర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. 1 నిమిషం 42 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ ఆద్యంతం అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, రక్తం చిందించే వైలెంట్ సీన్స్, గూస్‌బంప్స్ తెప్పించే విజువల్స్‌తో నిండిపోయింది.
ఈ టీజర్‌లో నాని కనిపించిన తీరు అభిమానులను, సగటు సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పొడవాటి జడలు, గుబురు గడ్డం, కళ్ళలో ఉగ్రరూపంతో నాని మునుపెన్నడూ చూడని రఫ్ అండ్ రా లుక్‌లో దర్శనమిచ్చారు. ఒంటినిండా రక్తపు చారలు, చేతిలో గన్ పట్టుకుని ప్రత్యర్థులపై విరుచుకుపడే తీరు సినిమా స్థాయిని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. ముఖ్యంగా శరీరం అంతా రక్తంతో తడిసిపోయి ఉన్నప్పటికీ ఎంతో ప్రశాంతంగా టీ కప్పు పట్టుకుని సిప్ చేసే ఒక ఐకానిక్ షాట్ నాని నట విశ్వరూపానికి నిదర్శనంగా నిలిచింది. ఈ సినిమాలో నాని నటన మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని టీజర్ ప్రతి ఫ్రేమ్‌లోనూ స్పష్టమవుతోంది.
టీజర్‌లో వినిపించిన డైలాగులు, బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఓవర్ కథలోని తీవ్రతను తెలియజేస్తున్నాయి. "అణచబడ్డ మన జాతి మరల బడాలి. ఛీ అని చీదరించుకున్న నలుపు రంగే మన జెండా. కాకే మన గుర్తు. థు అనిపించుకున్న కాకులు తల్వార్లు పడితే ఏమవుతుందో చూపిద్దాం" అనే డైలాగ్ తో వచ్చిన విజువల్స్ కట్టిపడేశాయి. ఇక చివర్లో "ఇరుగు దిష్టి పొరుగు దిష్టి... కత్తులన్నీ కటకటా... నెత్తురంతా చిటపట..." అంటూ నాని చెప్పే డైలాగ్ టీజర్ కే హైలైట్ గా నిలిచింది.
ఒక సాధారణమైన ప్రాంతంలో సామాన్య ప్రజలపై జరిగే అణచివేత, దానికి వ్యతిరేకంగా కథానాయకుడు తిరుగుబాటు చేసే పాయింట్ ఈ చిత్రంలో ప్రధానాంశంగా ఉండబోతోందని తెలుస్తోంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన మార్క్ రా అండ్ రస్టిక్ టేకింగ్‌తో ప్రతి సీన్‌ను ఎంతో పవర్ ఫుల్ గా తెరకెక్కించారు.
ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రతి యాక్షన్ సీన్‌కు అనిరుధ్ ఇచ్చిన ఎలక్ట్రిఫైయింగ్ బీట్స్, బిజిఎం థియేటర్లలో పూనకాలు తెప్పించేలా ఉన్నాయి.
పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 24, 2026 న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
'దసరా' మూవీ రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించగా, ఈ రెండవ కాంబినేషన్ 'ది ప్యారడైజ్' పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. నాని కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని టీజర్ నిరూపిస్తోంది.
The Paradise Teaser, Nani, Srikanth Odela
![]() |
![]() |