Home  »  News  »  korean kanakaraju: కొరియన్ కనకరాజు తో వరుణ్ తేజ్ హిట్.. ప్లాప్ కాకుండా ఉండాలంటే ఇలా!

Updated : Aug 6, 2026

 


విభిన్న కథనంతో కూడిన చిత్రాలు చేసుకెళ్లే హీరోగా వరుణ్ తేజ్(Varun Tej)కి అభిమానుల్లో, ప్రేక్షకులలో మంచి పేరు ఉంది. కానీ గత కొన్నేళ్లుగా కథ మంచిదే అయినా దాన్ని తీర్చిదిద్దే కంటెంట్ బలంగా లేకపోవడంతో ప్లాప్స్ తో సినీ సావాసం చేసుకుంటూ వస్తున్నాడు.  కానీ ఈ సారి ప్లాప్స్ కి సెండ్ ఆఫ్ చెప్పేసి కొరియన్ కనకరాజుతో హిట్ అందుకుంటాననే నమ్మకం వరుణ్ లో ఉంది. 

ఇండో-కోరియన్ హారర్ కామెడీ గా తెరకెక్కిన 'కోరియన్ కనకరాజు' ని  'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'ఏక్ మినిట్' వంటి  వినోదాత్మక సినిమాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించాడు . యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ పాజిటివ్ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా కథాంశం అత్యంత నూతనంగా, మునుపెన్నడూ చూడని రీతిలో రాయలసీమ సంస్కృతిని, కోరియన్ జానపద పురాణాలను మేళవించి రూపొందించడం విశేషం. పెనుకొండ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో కనకరాజు అనే షార్ట్ టెంపర్ ఉన్న కుర్రాడి క్యారక్టర్  లో వరుణ్ తేజ్ కనిపిస్తారు. సౌత్ కొరియాకు చెందిన ఒక ఆధ్యాత్మిక పురాతన వస్తువు కారణంగా, అండర్‌వరల్డ్ డాన్  ఆత్మ ఆవహించడంతో కనకరాజు జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. మూడు నిమిషాల నిడివితో విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా, సినిమాలోని హారర్, యాక్షన్, కామెడీ ఎలిమెంట్స్‌ను అద్భుతంగా ఆవిష్కరించింది. రాయలసీమ కారానికి కోరియన్ కిమ్‌చి తోడైతే ఎలాంటి కామెడీ హంగామా సృష్టిస్తుందో ట్రైలర్ రుచి చూపించింది. 


Also read: ఆయన్నిరిక్వెస్ట్ చేస్తేనే సంపూకి #ప్యారడైజ్ లో ఛాన్స్


ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ బాక్సాఫీస్ వద్ద మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా వరుణ్ తేజ్, కామెడీ స్టార్ సత్య మధ్య సాగే హిలేరియస్ టైమింగ్ సీన్స్ ప్రేక్షకులను థియేటర్లలో కడుపుబ్బ నవ్విస్తాయని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. ఈ చిత్రంలో వరుణ్ సరసన మిరాయ్ ఫేమ్'  రితిక నాయక్ కథానాయికగా నటిస్తుండగా, తమన్ అందించిన సంగీతం, పాటలు ఇప్పటికే శ్రోతలను విశేషంగా అలరిస్తున్నాయి.  ప్రమోషన్స్ లో వరుణ్ వాలకం, స్పీచ్ చూస్తుంటే హిట్ గ్యారంటీ అనే నమ్మకం అందరిలో ఉంది.  సినిమాపై ఉన్న  నిర్మాతలు ఈ రోజు రాత్రి ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్నారు. రిలీజ్ డేట్ ఆగస్టు 7 . 

korean kanakaraju, Varun Tej,  Merlapaka Gandhi






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.