Home  »  News  »  సర్దార్ 2 షాకింగ్ అప్ డేట్.. ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి మరి!

Updated : Jul 31, 2026

 

తమిళ, తెలుగు చిత్ర సీమలో సమానమైన క్రేజ్ సంపాదించుకున్న కార్తీ, గత కొన్ని చిత్రాల నుంచి మిస్ చేయకుండా వరుస పరాజయాలని అందుకుంటున్నాడు. కానీ ఈ సారి 'సర్దార్ 2 'తో హిట్ అందుకోవడమే లక్ష్యంగా ఉన్నాడు. సెప్టెంబర్ 10 రిలీజ్ డేట్. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో రిలీజ్ డేట్‌ పేర్కొనకపోవడంతో సినిమా విడుదల వాయిదా పడుతోందేమోనని, సెప్టెంబర్ 10న రావడం లేదేమోనని సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు షురూ అయ్యాయి. 


అయితే ఆ ఊహాగానాలకి స్వస్తి పలుకుతూ చిత్ర బృందం స్పష్టతనిచ్చింది. మేకర్స్ ముందే ప్రకటించినట్లుగా ఎలాంటి మార్పు లేకుండా సెప్టెంబర్ 10వ తేదీనే 'సర్దార్ 2' ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే అభిమానులకు అసలైన సర్‌ప్రైజ్ ఇస్తూ 'సర్దార్ 2' టీజర్ లాంచ్ డేట్ అండ్ టైమ్‌  యూనిట్ అధికారికంగా ఖరారు చేసి ఊహించని ధమాకా ఇచ్చింది.

ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'సర్దార్ 2' టీజర్ వీడియో విడుదలకు సమయం ఆసన్నమైంది. భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ విజువల్ వండర్ టీజర్‌ను త్వరలోనే లాంచ్ చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ టీజర్‌లో కార్తీ ఏజెంట్ చంద్రబోస్ అలియాస్ సర్దార్‌గా మైండ్ బ్లోయింగ్ గెటప్‌లో, సరికొత్త యాక్షన్ అవతార్‌లో కనిపించబోతున్నాడు. 100 రోజులకు పైగా చైనా, కాంబోడియా వంటి విదేశీ లొకేషన్లలో చిత్రీకరించిన అత్యున్నత స్థాయి యాక్షన్ సీక్వెన్సె టీజర్‌లో హైలైట్‌గా నిలవనున్నాయి.  సామ్ సి.ఎస్ అందిస్తున్న మాసివ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కి  ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.  


Also read: టాలీవుడ్‌లో 100 కోట్ల మోజు.. ఫేక్ బాక్సాఫీస్ పోస్టర్ల వెనుక దాగున్న చేదు నిజాలు!

సర్దార్ పార్ట్ 1 ఇచ్చిన విజయోత్సాహంతో, దర్శకుడు పి.ఎస్. మిత్రన్ సీక్వెల్‌ని  మరింత గ్రాండ్‌గా, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తున్నాడు. ప్రతిష్టాత్మక ప్రిన్స్ పిక్చర్స్ మరియు ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఎస్. లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా కార్తీకి పోటీగా పవర్‌ఫుల్ విలన్ రోల్ లో  ప్రముఖ నటుడు వర్సటైల్ యాక్టర్ ఎస్.జె. సూర్య నటిస్తుండటం మూవీపై అంచనాలని ఒక్కసారిగా రెట్టింపు చేశాయి. గ్లామరస్ బ్యూటీస్ మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, రజీషా విజయన్, యోగి బాబు కీ రోల్స్ .వినాయక చవితి పండగ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని సెప్టెంబర్ 10న రాబోతున్న ఈ స్పై యాక్షన్ ధమాకా కోసం అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


Sardar 2, Karthi,Malavika  Mohan, Ashika Ranganadh






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.