![]() |
![]() |

అడిగితే దేవుడు వరాలు ఇస్తాడో లేదో తెలియదు కానీ, సినిమా మాత్రం అభిమానులకి, ప్రేక్షకులకి వరాలు ఇస్తుంది. ఈ విషయం అభిమానులు, మూవీ లవర్స్ కి బాగా తెలుసు. అంత గొప్పది సినిమా. అసలు సినిమా అనే కళ పుట్టకపోయి ఉంటే ఈ దేశంతో పాటు మనుషులు ఇంకా ఎక్కడో యాభై ఏళ్ళ క్రితం మైండ్ సెట్ తో వెనుకంజలో ఉండే వాళ్ళు. అంతలా సమాజానికి సినిమా మంచి చెప్పడంతో పాటు తెలివిని నేర్పిస్తూ వస్తుంది.
అటువంటి గొప్ప చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఒక కొత్త విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. థియేటర్లలో జనాలు ఉన్నారా లేదా అనే విషయంతో సంబంధం లేకుండా, సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే 50 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు అంటూ భారీ అంకెలతో రంగురంగుల పోస్టర్లు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. థియేటర్లలో బొమ్మ సరిగ్గా ఆడక, ప్రేక్షకులు పెదవి విరిచి మిక్స్‌డ్ టాక్ ఇచ్చినా సరే, నిర్మాతలు మాత్రం మా సినిమా ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ అంటూ తెగ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. గ్రౌండ్ రియాలిటీ చూస్తే థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తుంటే, సామాజిక మాధ్యమాల్లో మాత్రం వందల కోట్ల వసూళ్ల కలరింగ్ పోస్టర్లు కళ్ళు బైర్లు కమ్మేలా దాడి చేస్తున్నాయి. ఇటీవల కొన్ని సినిమాల విషయంలో బాక్సాఫీస్ దగ్గర అసలు వసూళ్లు 3 కోట్లు దాటడమే కష్టంగా మారిన తరుణంలో, మేకర్స్ ఏకంగా రూ. 25 కోట్ల గ్రాస్ వచ్చిందని, త్వరలోనే 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెడుతోందని పోస్టర్లు వదలడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటువంటి పోస్టర్లను చూసి నెటిజన్లు సోషల్ మీడియాలో మీ గ్రాఫిక్స్ కంటే మీ కలెక్షన్ పోస్టర్లు బాగున్నాయంటూ ఘాటుగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ ఫేక్ ప్రచారం వెనుక ఉన్న అసలు నష్టం మాత్రం డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్ల పైనే పడుతోంది. పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక బయ్యర్లు నెత్తీ నోరు మొత్తుకుంటుంటే, నిర్మాతలు మాత్రం భారీగా కేకులు కట్ చేస్తూ, గ్రాండ్ సక్సెస్ మీట్లు ఏర్పాటు చేసి ఆర్భాటం చేస్తున్నారు. మరి సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ లో నిజం ఎంత ఉందో తెలియదు గాని, సినిమా అనేది సాక్షాత్తు కారణ జన్మురాలు, కారణ జన్ముడు. కాబట్టి అలాంటి సినిమా కలెక్షన్స్ ని ఫేక్ పోస్టర్స్ తో నింపి సినిమాని చులకనగా చేసి మాట్లాడే అవకాశం ఎవరకి ఇవ్వదని సినిమా ప్రేమికులు కోరుకుంటున్నారు.
Tollywood, Cinema
![]() |
![]() |