![]() |
![]() |
.webp)
నటీనటులు: టామ్ హాలండ్, జెండయా, సాడీ సింక్, జాకబ్ బాటలోన్, జోన్ బెర్న్తల్, ఫ్లోరెన్స్ పగ్, ట్రామెల్ టిల్మాన్, మైఖేల్ మాండో, మార్క్ రఫెలో
సాంకేతిక వర్గం:
మూల కథ: స్టాన్ లీ (Stan Lee), స్టీవ్ డిట్కో (Spider-Man comics)
రచన: క్రిస్ మెకెన్నా, ఎరిక్ సోమర్స్
ఛాయాగ్రహణం: బ్రెట్ పావ్లాక్
సంగీతం: మైఖేల్ జియాకినో
కూర్పు: నాట్ శాండర్స్, గినా సాన్సమ్, హ్యారీ యూన్
దర్శకత్వం: డెస్టిన్ డేనియల్ క్రెటన్
నిర్మాతలు: కెవిన్ ఫీజ్, అమీ పాస్కల్, అవి అరాద్, రాచెల్ ఓ'కానర్
స్పైడర్-మాన్ (Spider-Man) ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన సూపర్ హీరోలలో ఒకరు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)లో టామ్ హాలండ్ పోషించిన స్పైడర్-మాన్ పాత్రకు అభిమానుల నుండి విశేష స్పందన లభించింది. 'స్పైడర్-మాన్: నో వే హోమ్' తర్వాత దాదాపు ఐదేళ్ల విరామం తీసుకున్న నిర్మాతలు, ఇప్పుడు 'స్పైడర్-మాన్: బ్రాండ్ న్యూ డే' (Spider-Man Brand New Day) తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈరోజు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథ:
డాక్టర్ స్ట్రేంజ్ చేసిన మ్యాజిక్ వల్ల పీటర్ పార్కర్ అంటే ఎవరో ప్రపంచం మొత్తం మర్చిపోతుంది. ఆ తర్వాత న్యూయార్క్‌లో ఒక సాధారణ సూపర్ హీరోగా తన జీవితాన్ని స్పైడర్-మాన్ (Tom Holland) ఎలా కొనసాగించాడనేది ఈ కథ. ఎంఐటీలో చదువుతున్న తన స్నేహితులు నెడ్ లీడ్స్ (Jacob Batalon), MJ (Zendaya) వ్లాగ్స్ చూస్తూ పీటర్ కాలం గడుపుతుంటాడు. ఆ తర్వాత అతను ఎన్‌వైపీడీ (NYPD), యూఎస్ డ్యామేజ్ కంట్రోల్ ( US Damage Control) కోసం ఫ్రీలాన్స్ డిటెక్టివ్‌గా మారతాడు.
ఈ క్రమంలో జీన్ గ్రే (Sadie Sink) డ్యామేజ్ కంట్రోల్ ఆస్తులపై దాడి చేయడంతో అతనికి కొత్త ముప్పు ఎదురవుతుంది. ఆమెను పసిగట్టగల ఏకైక వ్యక్తి స్పైడర్-మాన్ మాత్రమే. మరోవైపు పీటర్ పార్కర్‌లోని మానవ డీఎన్‌ఏ కంటే సాలీడు లక్షణాలు ఎక్కువగా బయటపడటం మొదలవుతుంది. ఈ రెండు సమస్యలను అతను ఎలా సమతుల్యం చేసుకున్నాడు? ఈ అతిపెద్ద ముప్పును ఎదుర్కొని ఎలా గెలిచాడు? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
స్పైడర్-మాన్‌గా టామ్ హాలండ్ ఎప్పటిలాగే అద్భుతంగా నటించాడు. ఈసారి అతన్ని ఎక్కువగా సూట్‌లోనే చూపించడంతో పాటు, ఆండ్రూ గార్ఫీల్డ్ (Andrew Garfield) తరహాలో అద్భుతమైన ఫ్లైట్ సీన్స్, పీఓవీ (POV) షాట్స్ డిజైన్ చేశారు. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ టామ్ ఆకట్టుకున్నాడు. జెండయా, జాకబ్ బాటలోన్, జోన్ బెర్న్తల్, ఫ్లోరెన్స్ పగ్ (Florence Pugh), మార్క్ రఫెలో (Mark Ruffalo) తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.
సాడీ సింక్ స్క్రీన్ ప్రెజెన్స్, నటన బాగున్నాయి. అయితే భావోద్వేగాలను పండించడంలో దర్శకుడు తడబడినట్లు కనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్‌లో బలం లేకుండా, సులభంగా ముగించేసినట్లు అనిపిస్తుంది. పీటర్ పార్కర్ తన గుర్తింపును రహస్యంగా ఉంచుతూనే, ఓ సాధారణ యువకుడిగా, సూపర్ హీరోగా తన బాధ్యతలను ఎలా స్వీకరించాడనేది ముఖ్య కథాంశం.
కానీ ఈ బలమైన ఎమోషనల్ పాయింట్‌ను తెరపై చాలా తేలికగా చూపించారు. 'నో వే హోమ్' స్థాయిలో భావోద్వేగాలు ఈ సినిమాలో పండలేదు. యాక్షన్ సన్నివేశాలు కూడా గత చిత్రాల స్థాయిలో లేవు. భావోద్వేగాలు పండాల్సిన స్థాయి లో లేవు.
అయినప్పటికీ, 'హోమ్‌కమింగ్' కంటే 'బ్రాండ్ న్యూ డే' మెరుగైన అనుభూతిని ఇస్తుంది. ఇది 'ఫార్ ఫ్రమ్ హోమ్' స్థాయికి సరిపోతుంది కానీ, 'నో వే హోమ్' అంత ఎపిక్‌గా గానీ, ఎమోషనల్‌గా గానీ అనిపించదు. మొత్తంగా చెప్పాలంటే, అభిమానులకు ఈ చిత్రం సరదాగా అనిపిస్తుంది కానీ, వారు ఆశించిన స్థాయిలో అద్భుత దృశ్యకావ్యంలా మాత్రం ఉండదు.
ప్లస్ పాయింట్స్:
పీఓవీ (POV) స్పైడర్ స్వింగ్ సన్నివేశాలు.
ఆంట్ మే సీన్స్.
ఎంజే, స్పైడర్-మాన్ మధ్య వచ్చే సన్నివేశం.
జీన్ గ్రే రివీల్.
మైనస్ పాయింట్స్:
రొటీన్ రైటింగ్.
బలమైన ఎమోషన్స్ మిస్ అవ్వడం.
కొన్ని యాక్షన్ సన్నివేశాలను తేలికగా తీసుకోవడం.
హల్క్ యాక్షన్ సీన్
క్లైమాక్స్ ఇంకాస్త బలంగా ఉండాల్సింది.
చివరి గా:
ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లే అభిమానులకు ఈ సినిమా సరదాగా అనిపిస్తుంది.
రేటింగ్: 2.75/5
గమనిక: ఈ రివ్యూలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు పూర్తిగా రచయిత వ్యక్తిగతమైనవి. దీనికి సంస్థకు ఎలాంటి బాధ్యత లేదు. పాఠకులు తమ సొంత విచక్షణతో స్పందించగలరు.
Spider Man Brand New Day Movie Review and Rating in Telugu, Spider-Man: Brand New Day Movie Review in Telugu, Spider-Man: Brand New Day, Tom Holland, Zendaya, Sadie Sink, Jacob Batalon, Jon Bernthal, Florence Pugh, MCU, TeluguOne, TeluguOne Movie Reviews
![]() |
![]() |