![]() |
![]() |

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన సరికొత్త సామాజిక కథా చిత్రం 'ది ఇండియా స్టోరీ'. సినీ ప్రియులు, కాజల్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల విషయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ చిత్రం జూలై 24న థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో సెన్సార్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల తాత్కాలికంగా నిలిచిపోయినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. హిందీ వెర్షన్ మాత్రం అనుకున్న తేదీకే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
సమాజంలో తీవ్ర చర్చకు దారితీసే ఒక అత్యంత కీలకమైన సామాజిక అంశాన్ని నేపధ్యంగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. ముఖ్యంగా మన దేశంలో వ్యవసాయ రంగంలో విచ్చలవిడిగా ఉపయోగిస్తున్న రసాయనాల వల్ల ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి తీవ్ర ప్రభావం పడుతోంది అనే చేదు నిజాలను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆహార భద్రత, పర్యావరణ సమతుల్యత, ప్రజారోగ్యం చుట్టూ తిరిగే ఈ కథాంశం ప్రేక్షకులలో ఆలోచన రేకెత్తించేలా ఉంటుందని మేకర్స్ మొదటినుంచీ చెబుతున్నారు.
ఈ సందేశాత్మక చిత్రంలో కాజల్ అగర్వాల్ ఒక పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే కూడా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించి మెప్పించబోతున్నారు.
చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు జీ స్టూడియోస్, ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తుండగా, సాగర్ బి.షిండే ఎంతో నిర్మించారు.
అయితే డబ్బింగ్ వెర్షన్లకు సంబంధించిన సెన్సార్ క్లియరెన్స్ ప్రక్రియ అనుకున్న సమయానికి పూర్తికాకపోవడమే ఈ హఠాత్ వాయిదాకు కారణమని తెలుస్తోంది. త్వరలోనే సెన్సార్ పూర్తి చేసుకుని తెలుగు, తమిళ భాషల్లో కొత్త విడుదల తేదీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Kajal Aggarwal, The India Story, Postponed
![]() |
![]() |