Home  »  News  »  Pawan Kalyan vs vijay: పవన్ కళ్యాణ్ ని దాటలేకపోయిన విజయ్!

Updated : Jul 23, 2026

 

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. ఇళయ దళపతి విజయ్(Vijay).. సౌత్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తమదైన ఆధిపత్యం చెలాయించే హీరోలు. కట్ అవుట్ కనపడితే చాలు కోట్లు కురవాల్సిందే. అభిమాన ఘనానికైతే లెక్కే లేదు.ఇప్పుడు ఈ ఇద్దరు సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.


పవన్ నుంచి గత ఏడాది వచ్చిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'ఓజీ' (OG) థియేటర్లలో సాధించిన సంచలన ఓపెనింగ్స్ అందరినీ విస్తుపోయేలా చేశాయి.వరల్డ్ వైడ్ గా మొదటి రోజూ 154 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ఆల్ టైమ్ టాప్ 10 ఇండియన్ ఓపినింగ్ కలెక్షన్స్   జాబితాలో నిలిచింది. నార్త్ అమెరికా ప్రీమియర్ల ద్వారానే ఏకంగా $3.13 మిలియన్ల కంటే ఎక్కువ రాబట్టడం పవన్ కళ్యాణ్ మాస్ స్టామినాకి నిదర్శనం. ఇండియా వైడ్ గా  90 కోట్లకి  పైగా నెట్ వసూళ్లు సాధించి సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన సినిమాల్లో   ఒకటిగా రికార్డు పుటలకెక్కింది. 

Also read: జననాయకుడు vs చెన్నై లవ్ స్టోరీ.. తెలుగు ప్రేక్షకులు ఆ వైపే ఎందుకు!


విజయ్ స్టిల్ జన నాయగన్(జననాయకుడు) తో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. దీంతో మొదటి రోజు  'ఓజీ' నెలకొల్పిన  154 కోట్ల ప్రపంచవ్యాప్త వసూళ్ల మార్కుని  'జన నాయగన్' దాటగలదా లేదా?అనే చర్చలు మొదలయ్యాయి. మూవీ అయితే కొన్ని ఏరియాస్ లో డిజాస్టర్, కొన్ని ఏరియాల్లో పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది.ట్రేడ్ వర్గాల ముందస్తు అంచనాల ప్రకారం 'జన నాయగన్' తమిళనాడు, కేరళ, కర్ణాటక ఓవర్సీస్ మార్కెట్లలో రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్‌ నమోదు చేసింది. దీంతో తొలిరోజే గ్లోబల్‌గా 100 కోట్ల కంటే ఎక్కువ గ్రాస్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ 'ఓజీ' నెలకొల్పిన రూ. 154 కోట్ల రికార్డును అందుకోవాలంటే 'జన నాయగన్' తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియా మార్కెట్‌లో ఊహించని రేంజ్‌లో రాణించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏపీ, తెలంగాణ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి, ఓవర్సీస్ ప్రీమియర్స్‌లో భారీ వసూళ్లు రాబడితే 'ఓజీ' రికార్డు ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు. కానీ ఆ ప్రమాదం లేదనే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

og, pawan kalyan, vijaythalapathy, vijay, jana nayagan

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.