![]() |
![]() |

గత సెప్టెంబర్‌లో, 21 ఏళ్ల టిక్‌టాక్ స్టార్ డేవిడ్(David)పేరిట రిజిస్టర్ అయిన కారు అమెరికాలోని టెక్సాస్ ఏరియాలో రోడ్డు పక్కన నిలిపి ఉంచబడింది. ఆ కారు నుండి తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి కారు డిక్కీని తెరిచి చూడగా, అందులో ప్లాస్టిక్ బ్యాగుల్లో కుక్కబడిన మృతదేహం కనిపించింది. సదరు బాడీ 14 ఏళ్ల మైనర్ బాలిక సెలెస్టే రివాస్ హెర్నాండెజ్‌గా గుర్తించారు. బాలిక మరణానికి సంబంధించి డేవిడ్ హత్యానేరంతో సహా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
మృతదేహం దాదాపు నాలుగు నెలల పాటు కారులోనే ఉండటంతో తీవ్రంగా కుళ్ళిపోయి, అవయవాలు వేరు చేయబడిన స్థితిలో ఉంది. పోస్టుమార్టం రిపోర్ట్ నివేదిక ప్రకారం, ఆమె శరీరంలో బలమైన గాయాలు ఉన్నట్లు, పదునైన ఆయుధంతో దాడి జరిగినట్లు తేలింది.
Also read: Trisha: ఎలక్షన్స్ అయిన వెంటనే త్రిష సాంగ్ వైరల్..అర్జునార్ విల్లు ఎవరు
డేవిడ్ బర్క్ ని ప్రధాన నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం బాలికతో ఉన్న అక్రమ సంబంధం బయటపడుతుందనే భయంతో ఆమెను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ముక్కలు చేసి కారు డిక్కీలో దాచిపెట్టినట్లు ప్రాసిక్యూటర్లు కోర్టుకి వివరించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణలో ఉంది, నిందితుడు తనపై వచ్చిన ఆరోపణలని మాత్రం ఒప్పుకోవడం లేదు. ప్రజలు మాత్రం అభం శుభం తెలియని బాలికని చంపినందుకు కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
![]() |
![]() |