![]() |
![]() |

-పెద్ది స్పెషల్ సాంగ్ లో ఎవరు
-రంగంలోకి బాలయ్య హీరోయిన్
-నిజమవ్వాలని ఆశపడుతున్న ఫ్యాన్స్
గత కొన్ని రోజులుగా అభిమానులతో పాటు సినీ సర్కిల్స్ లో ఎక్కువగా నానుతున్న చర్చల్లో పెద్ది(Peddi)స్పెషల్ సాంగ్. సదరు స్పెషల్ సాంగ్ లో రకరకాల హీరోయిన్ల పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. కాకపోతే ఆ పేర్లన్నీ రూమర్స్ క్యాటగిరిలోనే తమ ప్రస్థానాన్ని ముగించాల్సిన పరిస్థితి. రీసెంట్ గా మరో రూమర్ అదే తీరులో సినీ సర్కిల్స్ లో తన ప్రతాపాన్ని చూపిస్తుంది. మరి ఆ న్యూస్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూద్దాం.
సంయుక్త మీనన్(Samyuktha Menon).. ఒక ఆఫర్ తర్వాత మరో ఆఫర్ రావడానికే టైం పడుతున్న వేళ వెంట వెంట సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది. ఈ పాటికే మీకు అర్ధం అయినట్టు ఉండచ్చు. పెద్ది స్పెషల్ సాంగ్ లో సంయుక్త మీనన్ చేయబోతోందనే వార్తలు వస్తున్నాయని. అవును. ఇప్పుడు ఈ న్యూస్ జనరల్ గా సోమవారం రోజు డల్ గా ఉండే వాతావరణంలో జోష్ ని తీసుకొచ్చింది. సదరు న్యూస్ చూస్తున్న ఫ్యాన్స్ అయితే అది నిజమవ్వాలని కోరుకుంటున్నారు. కానీ వాళ్ళతో పాటు అందరికి తెలిసిన నిజం ఏంటంటే సదరు ఆఫర్ సంయుక్త మీనన్ కి వస్తే అసలు వదులుకోదు.
Aslo read: VIjay Deverakonda: విజయ్ దేవరకొండకి నా తర్వాతనే రష్మిక.. వైరల్ అవుతున్న ప్రముఖ నటి కామెంట్స్
'భీమ్లా నాయక్',తో ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ ముద్దుగుమ్మ 'బింబిసార', 'సార్', 'విరూపాక్ష' . అఖండ 2 వంటి వరుస విజయాలతో గోల్డెన్ లెగ్ హోదాలో కొనసాగుతుంది. ప్రస్తుతం సోలో క్యారక్టర్ లో బ్లాక్ గోల్డ్ తో పాటు నిఖిల్ స్వయంభులో చేస్తుంది.

![]() |
![]() |