![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన 'కెంజుట్సు'లో అధికారికంగా ప్రవేశం పొందడం ద్వారా ఒక గొప్ప అంతర్జాతీయ గౌరవాన్ని పొందారు.
సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన పవన్ కళ్యాణ్ కి మార్షల్ ఆర్ట్స్ లోనూ ప్రావీణ్యం ఉన్న విషయం తెలిసిందే. సినిమాలు, రాజకీయాల్లోకి ప్రవేశించకముందే ఆయన మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం ప్రారంభమైంది. మూడు దశాబ్దాలకు పైగా క్రమశిక్షణతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారు. సాధనతో పాటు పరిశోధన కూడా చేస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనంగా పవన్ కి అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది.
మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆయన అంకితభావాన్ని గుర్తించిన అంతర్జాతీయ సంస్థలు, పవన్ కళ్యాణ్‌కు పలు ప్రతిష్ఠాత్మక గౌరవాలు అందించాయి. జపాన్ సంప్రదాయ యుద్ధకళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థలలో ఒకటైన 'సోగో బుడో కన్‌రి కై' నుంచి ఆయనకు ఫిఫ్త్ డాన్ పురస్కారం లభించింది. అలాగే, జపాన్ వెలుపల 'సోకే మురమత్సు సెన్సై'లోని 'టకెడా షింగెన్ క్లాన్'లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన నిలిచారు. అంతేకాకుండా, గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ద్వారా ఆయనకు “టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్” అనే విశిష్ట బిరుదుతో సత్కారం కూడా జరిగింది.

![]() |
![]() |