![]() |
![]() |

-తమిళ రాజకీయాల్లో అరుదైన సంచలనం
-ఈక్వెషన్స్ మారబోతున్నాయా!
-మరి జననాయగన్ రిలీజ్ ఎప్పుడు
నిన్న విడుదల కావాల్సిన ఇళయ దళపతి 'విజయ్' వన్ మాన్ షో 'జననాయగన్' రిలీజ్ డేట్ వాయిదా పడిన విషయం తెలిసిందే. మూవీలోని కొన్నిసన్నివేశాలు, డైలాగ్స్ రాజకీయపరంగా ఉండటమే అందుకు కారణం. ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా విజయ్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ తమ తోచిన అభిప్రాయాన్ని చెప్తు వస్తున్నారు. కానీ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ జన నాయగన్ అంశంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు స్టేట్ ని ఒక ఊపు ఉపుతున్నాయి.
స్టాలిన్ మాట్లాడుతు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్ డిఏ ప్రభుత్వం తమ రాజకీయ లబ్ది కోసం సిబిఐ, ఈడి, ఐటి వంటి కేంద్ర సంస్థల్ని ఉపయోగించుకుంటుంది. ఇప్పుడు ఈ జాబితాలో సెన్సార్ కూడా చేరింది. సదరు సెన్సార్ ని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటు తమ ఇష్ట రీతిలో వ్యవహరిస్తున్నాయి. ఇటువంటి చర్యలని తీవ్రంగా ఖండిస్తున్నానని వ్యాఖ్యానించడం జరిగింది. జన నాయగన్ అనే పేరు తన మాటల్లో రాకపోయినా స్టాలిన్ మాట్లాడింది సదరు చిత్రం గురించే అనే విషయం క్లియర్ గా అర్ధమవుతుంది.
Also read: బెనిఫిట్ షో, టికెట్ రేట్లు పెంపుకి నేను అనుమతి ఇవ్వలేదు.. పట్టించుకోవడం మానేశా
విజయ్ తన రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కజగం' ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. చాలా బహిరంగ సభల్లో తన ప్రత్యర్థి డిఏంకె అని వెల్లడి చెయ్యడంతో పాటు స్టాలిన్ పై విమర్శనాస్త్రాలు కూడా గుప్పిస్తు వస్తున్నాడు. ఈ నేపధ్యంలోనే జన నాయగన్ సెన్సార్ విషయంలో స్టాలిన్ మాటలు ఇప్పుడు తమిళనాడు స్టేట్ ని ఒక ఊపు ఉపుతున్నాయి. కానీ స్టాలిన్ వ్యాఖ్యలని భారతీయ జనతా పార్టీ ఖండించింది. ఇక జన నాయగన్ రిలీజ్ కి సెన్సార్ నుంచి అడ్డంకులు తొలిగిపోయాయని జనవరి 14 న రిలీజ్ ఉంటుందనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
![]() |
![]() |