![]() |
![]() |

-ఎవరు ఊహించలేదు
-ఎందుకు వేడుకలు రద్దు
-సన్నీలియోన్ ఏం చెప్తుంది!
జిస్మ్ 2 తో భారతీయ సినీ ప్రేక్షకులని తన మానియాతో మెస్మరైజ్ చేసిన నటీ 'సన్నీలియోన్'(Sunny Leone). తన పోస్టర్ పడితే చాలు థియేటర్స్ కి ప్రేక్షకులు పరుగులు పెట్టేలా అంత స్టేటస్ కూడా సన్నీలియోన్ సొంతం. దక్షిణాదిలో కూడా ల్యాండ్ అయ్యి మన తెలుగులో మంచు మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా వచ్చిన 'కరెంటు తీగ'లో చేసింది. సినిమాలకి సంబంధం లేకుండా సన్నీ లియోన్ పలు ప్రైవేట్ ఫంక్షన్స్ కి హాజరై అభిమానులని, ఆహుతులని అలరిస్తూ వస్తుంది. నూతన సంవత్సర వేడుకలకి కూడా గెస్ట్ గా వెళ్లి అభిమానుల్లో ఉన్న న్యూ ఇయర్ జోష్ ని రెట్టింపు చేసిన సందర్భాలు ఉన్నాయి.
ఈ కోవలోనే న్యూ ఇయర్ సందర్భంగా రేపు ఉత్తర ప్రదేశ్ లోని మధుర(Mathura)లోని ఒక ప్రముఖ ప్రైవేట్ హోటల్ రూఫ్‌టాప్ రెస్టారెంట్లో సన్నీలియోన్‌తో డీజే నైట్ నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. 300 మందికి మాత్రమేప్రవేశం ఉండేలా టికెట్లు ముందుగానే విక్రయించారు. ఈ ఈవెంట్ పై సన్నీలియాన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మీ మధుర వచ్చి డి జె గా న్యూ ఇయర్ జోష్ ని మరింతగా పెంచబోతున్నామని వీడియో కూడా చేసింది. కానీ ఈ ఈవెంట్‌పై స్థానిక సాధువులు, పూజారులు, హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మధుర, బృందావన్, బ్రజ్ ప్రాంతం మొత్తం శ్రీకృష్ణుడి లీలలకు సాక్ష్యమైన పవిత్ర భూమి. భజనలు, కీర్తనలు, ధార్మిక కార్యక్రమాలు జరగాల్సిన ప్రాంతంలో నైట్ పార్టీలు, డీజే ఈవెంట్లు నిర్వహించడం బ్రజ్ ప్రాంత సంప్రదాయాలకి విరుద్ధమని తమదైన శైలిలో ఆందోళన నిర్వహించారు. జిల్లా అధికార యంత్రాంగానికి లేఖలు కూడా రాసి తమ ఆందోళనని ఉధృతం చేసింది.
Also Read: ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి
ఈ నేపథ్యంలో ఈవెంట్ నిర్వాహకుడు మితుల్ పాఠక్ స్పందిస్తు'సన్నీలియోన్‌ని ఒక ఆర్టిస్ట్‌గా మాత్రమే ఇన్ వైట్ చేసాం.ఇది కేవలం డీజే పెర్ఫార్మెన్స్ మాత్రమే. అన్ని చట్టపరమైన అనుమతులు, పరిపాలనా నిబంధనలు పాటించాం. అయినప్పటికీ, సామాజిక మరియు ధార్మిక మనోభావాలను గౌరవిస్తు ఈవెంట్ ని రద్దు చేస్తున్నాం. ఈ రద్దుతో ఆర్ధికంగా కొంత నష్టం వస్తుందని తెలిపాడు.
![]() |
![]() |