![]() |
![]() |
.webp)
-నష్టం నిజమేనా!
-ఎంత నష్టం
-ప్రణబ్ కపాడియా ఏమంటున్నాడు
-ధురంధర్ కి వచ్చింది ఎంత
రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.
ధురంధర్ డిసెంబర్ 5 న మన దేశంతో పాటు యూరప్, ఉత్తర అమెరికాలో గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. కానీ పశ్చిమాసియాలో నిషేధం విధించడంతో గల్ఫ్ మార్కెట్ లో దురంధర్ కాలు మోపలేదు.ఈ విషయంపై విదేశీ పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా మీడియాతో మాట్లాడుతు యాక్షన్ చిత్రాల్ని గల్ఫ్ దేశాల్లో ఎంతగానో ఆదరిస్తారు. దీంతో అదే కంటెంట్ తో ఉన్న దురంధర్ ని గల్ఫ్ ప్రేక్షకులు ఆదరిస్తారని రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ మా ప్రయత్నాలు ఫలించకపోవడంతో రిలీజ్ కాలేదు. దీంతో సుమారు 90 కోట్ల రూపాయలు నష్టపోయామని తెలిపాడు.
Also Read: గత వైభవం మూవీ రివ్యూ
దురంధర్ ని పాకిస్థాన్ కి వ్యతిరేఖంగా పిక్చరైజ్ చేయడం వల్లే గల్ఫ్ దేశాలైన కువైట్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, బహ్రేయిన్, తో పాటు యూఏఈ దేశాల్లో బ్యాన్ చేసినట్టుగా బాలీవుడ్ లోని అన్ని మీడియా ఛానల్స్ వెల్లడి చేసాయి. మరి ఈ లెక్కన ఆ దేశాల్లో కూడా రిలీజై ఉంటే కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు.
![]() |
![]() |