![]() |
![]() |

ట్రోలింగ్స్ కి ఎవరు అనర్హులు కాదు అనే రీతిలో సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రటీస్ పై వచ్చే ట్రోల్స్ ఎంతగా సంచలనం సృష్టిస్తు ఉంటాయనే విషయం తెలిసిందే. ఈ విషయంలో సినీ సెలెబ్రటీస్ అయితే సంచలనం స్థాయి ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. సదరు సినీ సెలబ్రటీస్ కూడా అంతే స్థాయిలో ట్రోలర్స్ ని తిప్పికొడుతున్న సందర్భాలు కూడా జరుగుతూనే ఉన్నాయి.రీసెంట్ గా ప్రముఖ స్టార్ హీరో కిచ్చా సుదీప్(Kiccha Sudeep)కూతురు ఆ పనే చేసింది.
సుదీప్ కూతురు పేరు శాన్వి(Sanvi)..అప్ కమింగ్ గాయని గా తనదైన శైలిలో దూసుకుపోతుంది. ఇటీవల సుదీప్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మార్క్(Mark)మూవీలో 'మస్త్ మలైకా' అనే సాంగ్ ని ఆలపించింది. సాంగ్ లోని వాయిస్ బాగానే ఆకట్టుకున్నా కొన్ని పదాలని శాన్వి సరిగా పలకలేదని ట్రోల్ చేస్తున్నారు. అంతటితో ఊరుకోకుండా బాడీ షేమింగ్ చేస్తు కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ఆ ట్రోల్స్ పై రీసెంట్ గా శాన్వి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'సాంగ్ విషయంలో నేను మీ అభిప్రాయాన్ని అడగలేదు కదా! నేను అడిగితే మీరు అభిప్రాయాలు చెప్పండి. పైగా నా శరీరం గురించి కూడా ఎందుకు మాట్లాడుతున్నారని శాన్వి ట్రోలర్స్ కి గట్టిగానే రిప్లై ఇచ్చింది. శాన్వి ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాచురల్ స్టార్ నాని(Nani)వన్ మాన్ షో హిట్ 3 లో కూడా పోరాటమే అనే సాంగ్ పాడింది.
Also read: నీ మొగుడికి చూపించుకో.. అనసూయ పై ఫైర్
ఈ విషయంలో సుదీప్ అభిమానులు శాన్వికి అండగా నిలుస్తూ ట్రోలర్స్ కి సూపర్ గా రిప్లై ఇచ్చావని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. సుదీప్ కి శాన్వి ఒక్కగానొక్క కూతురు. తల్లి పేరు ప్రియా రాధాకృష్ణ. ఆమెది కేరళ. సుదీప్ కి ప్రియాకి 2001 లో వివాహం జరిగింది.

![]() |
![]() |