![]() |
![]() |

-డేట్ ఇదే
-ఆ డేట్ కి మరో స్పెషాలిటీ
-అభిమానులు హ్యాపీ
ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.
శిరీష్ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ఇనిస్టాగ్రమ్(Instagram)వేదికగా అల్లు అర్జున్ కుమారుడు అయాన్, కుమార్తె అర్హ తో కలిసి రీల్స్ చేస్తు తన వివాహం మార్చి 6 న పెళ్లి జరగబోతుందని వెల్లడి చేసాడు. సదరు రీల్ లో అయాన్ మాట్లాడుతు'బాబాయ్ సంగీత్ ఎప్పుడు ఉంటుందని అడిగాడు. అందుకు శిరీష్ బదులిస్తు'మనం దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోమని చెప్పాడు. పెళ్లి వేడుక జరిగే ప్లేస్ గురించి మాత్రం చెప్పలేదు. దీంతో పెళ్లి ఎక్కడ జరుగుతుందనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. ఇక మార్చి 6 డేట్ కి ఉన్న స్పెషల్ ఏంటంటే అల్లు అర్జున్, స్నేహరెడ్డి పెళ్లి కూడా అదే రోజు జరిగింది.
also read: సిల్వర్ స్క్రీన్ కి 2025 న్యాయం జరిగిందా! లేక అన్యాయమా!
![]() |
![]() |