![]() |
![]() |

-ఏం చెప్తున్నాడు
-తన పిల్లలు ఏమంటారు
-వరుణ్ తేజ్ గనిలో మెస్మరైజ్
ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.
రీసెంట్ గా సునీల్ శెట్టి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఆయన మాట్లాడుతు పొగాకు ఉత్పత్తులకి సంబంధించి నా దగ్గరకి ఒక యాడ్ వచ్చింది. అందులో చేస్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ అలాంటి వాటిల్లో చేస్తే నా పిల్లలు ఆహాన్, అతియాకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. నా పిల్లలకి ఆదర్శంగా ఉండాలనే సదరు యాడ్ ని తిరస్కరించానని చెప్పుకొచ్చాడు. ఇక ఇదే ఇంటర్వ్యూ లో సినిమాల్లో వచ్చిన గ్యాప్ పై మాట్లాడుతు నేనే విరామం ఇచ్చాను. 2014 లో నాన్న అనారోగ్యానికి గురయ్యారు. దాంతో అయన్ని చూసుకుంటూ ఉండేవాడిని. 2017 లో నాన్న చనిపోయాక మనసేం బాగోలేదు. దాంతో కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ నటించడం మొదలుపెట్టానని వెల్లడి చేసాడు.
Also Read: అదరగొడుతున్న శంబాల.. నాలుగు రోజుల కల్లెక్షన్స్ ఇవే
1992 లో 'బల్వాన్' అనే మూవీతో ఎంట్రీ ఇచ్చిన సునీల్ శెట్టి ఎన్నో హిట్ చిత్రాల్లో చేసి యాక్షన్ హీరో అనే టాగ్ లైన్ తో అగ్ర హీరో రేంజ్ కి ఎదిగాడు. ఇప్పటి వరకు సుమారు వంద చిత్రాలు సునీల్ శెట్టి ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం ప్రాముఖ్యత గల క్యారక్టర్ రోల్స్ చేస్తు పలు అప్ కమింగ్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. తెలుగులో కూడా వరుణ్ తేజ్ తో గని, మంచు విష్ణు తో మోసగాళ్లు అనే సినిమాల్లో చేసాడు.
![]() |
![]() |