![]() |
![]() |

2025 ముగింపుకి వచ్చేసింది. డిసెంబర్ చివరి వారంలో స్టార్స్ సందడి లేదు కానీ.. పలు ఆసక్తికర సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ డిసెంబర్ 25న అర డజనుకు పైగా సినిమాలు విడుదలవుతున్నాయి. మరి వీటిలో ఈ ఏడాది చివరి విజేతగా నిలిచే సినిమా ఏది?
లుక్స్ పరంగా టాలీవుడ్ హృతిక్ రోషన్ గా పేరు తెచ్చుకున్న రోషన్ మేకా.. డిసెంబర్ 25న 'ఛాంపియన్'(Champion)తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో స్వప్న సినిమా నిర్మించిన ఈ సినిమా.. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కంటెంట్ మీద నమ్మకంతో ఈ సినిమాకి ఏకంగా రూ.40 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టినట్లు తెలుస్తోంది. నిజాం పాలనలో రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడిన బైరాన్‌పల్లి గ్రామ చరిత్ర ఆధారంగా ఇది తెరకెక్కింది.
ప్రేమ కావాలి, లవ్‌లీ వంటి విజయవంతమైన సినిమాలతో కెరీర్ ని ప్రారంభించిన ఆది సాయికుమార్.. ఆ తర్వాత ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయాడు. కొన్నేళ్లుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది.. ఇప్పుడు 'శంబాల'(Shambhala)తో తన లక్ ని టెస్ట్ చేసుకోబోతున్నాడు. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ ఫిల్మ్.. టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకుంది. మంచి ధరకు అన్ని రైట్స్ అమ్ముడై.. విడుదలకు ముందే నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది.
తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ జర్నీని చూడబోతున్నామనే నమ్మకాన్ని ప్రచార చిత్రాలతో కలిగించింది 'దండోరా'(Dhandoraa). శివాజీ, నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాపై కూడా పాజిటివ్ బజ్ నెలకొంది.
హారర్ సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఆ జానర్ లో వస్తున్న మూవీ ఈషా(Eesha). త్రిగుణ్, హెబ్బా పటేల్, అఖిల్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రచార చిత్రాలతో బాగా భయపెట్టింది. ఇటీవల చిన్న సినిమాలతో హిట్లు కొడుతున్న బన్నీవాస్, వంశీ నందపాటి ఈ సినిమాని విడుదల చేస్తుండటం విశేషం.
ఈ వారం 'పతంగ్'(Patang) రూపంలో యూత్ ఫుల్ కామెడీ ఫిల్మ్ కూడా రాబోతుంది. టీజర్, ట్రైలర్ మెప్పించాయి. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సమర్పకుడు కావడం ఈ సినిమాకి కలిసొచ్చే మరో అంశం.
వీటితో పాటు రెండు డబ్బింగ్ సినిమాలు కూడా వస్తున్నాయి. మలయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన 'వృషభ'(Vrusshabha), కన్నడ స్టార్ సుదీప్ నటించిన 'మార్క్'(Mark) కూడా డిసెంబర్ 25నే వస్తున్నాయి.
ఈ వారం విడుదలవుతున్న అన్ని సినిమాలు.. కంటెంట్ పరంగా నమ్మకం కలిగిస్తున్నాయి. మరి వీటిలో విన్నర్ ఏది? అనేది త్వరలోనే తేలిపోనుంది.
![]() |
![]() |