![]() |
![]() |

ఆది సాయి కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘శంబాల’. యగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ నిర్మించిన ఈ మూవీలో అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. డిసెంబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో.. తాజాగా రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఆదివారం నాడు నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదలైంది. (Shambhala Mystical Trailer)
దాదాపు రెండు నిమిషాల నిడివితో రూపొందిన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఆకాశం నుంచి ఓ ఉల్క పడటంతో ట్రైలర్ మొదలైంది. ‘పంచభూతాల్ని శాసిస్తుందంటే ఇది సాధారణమైనది కాదు’.. అనే డైలాగ్‌తో ఆ ఉల్క శక్తిని చూపించారు. ఇక ఊర్లో అందరూ వింతగా ప్రవర్తిస్తుండటం, ఆ ఉల్కను కట్టడి చేసేందుకు పూజలు చేయడం, మఠాధిపతులను తీసుకు రావడం చూపించారు. (Shambhala Trailer)
ఇక మిస్టరీని ఛేదించేందుకు నాస్తికుడైన హీరో రంగంలోకి దిగడం "మీ కాకమ్మ, కాశీ, మజిలీ కథలు ఊరి జనాలకు చెప్పండి.. నాక్కాదు" అని అనడం చూస్తే అతని పాత్ర ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. ఊర్లో వరుసగా హత్యలు, ఆత్మహత్యలు జరుగుతుంటాయి. "ఇప్పటి నుంచి మీ పిచ్చితనానికి ఎవ్వరినీ బలికానివ్వను.. అది ఆవైనా సరే.. చీమైనా సరే" అని హీరో పరిష్కారం కనిపెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఊరికి వ్యతిరేకంగా హీరో చేసే పోరుని ట్రైలర్లోనే అద్భుతంగా చూపించారు. ఇక ట్రైలర్ లో ప్రవీణ్ కె బంగారి విజువల్స్, శ్రీ చరణ్ పాకాల ఆర్ఆర్ ఆకట్టుకున్నాయి.
ప్రేమ కావాలి, లవ్లీ వంటి విజయవంతమైన సినిమాలతో కెరీర్ ప్రారంభించిన ఆది.. ఓ మంచి విజయం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. తాజా ‘శంబాల’ ట్రైలర్ చూస్తుంటే.. ఆది ఎదురుచూస్తున్న హిట్ రావడం ఖాయమనిపిస్తోంది.
కాగా, ఇప్పటికే ‘శంబాల’ సినిమా మేకర్లకు లాభసాటి ప్రాజెక్ట్‌గా మారింది. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రైట్స్ మంచి ధరకు అమ్ముడయ్యాయి. రిలీజ్‌కు ముందే టేబుల్ ప్రాఫిట్స్‌తో నిర్మాతలు హ్యాపీగా ఉన్నారు. మరి డిసెంబర్ 25న థియేటర్లలో అడుగుపెడుతున్న ఈ సినిమా.. బయ్యర్లకు కూడా లాభాలను తెచ్చి పెడుతుందేమో చూడాలి.
![]() |
![]() |