![]() |
![]() |

విజయ్ దేవరకొండ తన 12వ సినిమాని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్. కొంతభాగం చిత్రీకరణ జరుపుకున్న తర్వాత.. విజయ్ 'ఫ్యామిలీ స్టార్'తో బిజీ కావడంతో ఈ మూవీ షూటింగ్ బ్రేక్ పడింది. దీంతో దర్శకుడు గౌతమ్ ఈ గ్యాప్ లో ఓ చిన్న సినిమాని పూర్తి చేసే పనిలో పడిపోయాడు. అయితే వచ్చే వేసవి నుంచి 'VD 12' షూటింగ్ తిరిగి ప్రారంభం కానుందని తెలుస్తోంది.
ఈ ఏడాది మార్చి నుంచి 'VD 12' షూటింగ్ లో పాల్గొనేలా విజయ్, శ్రీలీల డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 'ఫ్యామిలీ స్టార్' చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. ఈ షూటింగ్ పూర్తి కాగానే 'VD 12'తో బిజీ కానున్నాడు విజయ్. అలాగే శ్రీలీల కూడా మార్చి నుంచి షూటింగ్ లో పాల్గొనడానికి ఓకే చెప్పినట్లు సమాచారం.
![]() |
![]() |