![]() |
![]() |

7వ తేది శుక్రవారం సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్ జేఆర్‌సీ కన్వన్షన్ సెంటర్‌లో మంచు లక్ష్మీ నటించిన లక్ష్మీ బాంబ్ ఆడియో మోగనుంది. ఈ సినిమాకి లోఫర్ ఫేం సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందించిన పాటలు త్వరలోనే మనం వినబోతున్నాం. డైరెక్టర్ కార్తీకేయ గోపాలకృష్ణ మాట్లాడుతూ లక్ష్మీబాంబ్ సినిమాకి ఎలాంటి పాటలైతే ఆప్ట్‌గా ఉంటాయో మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కూడా అలాంటి పాటలే కంపోజ్ చేసి మనకి అందించడం ఈ మూవీకి మంచి ప్లస్ పాయింట్ అవుతుందన్నారు. ఈ సినిమాలో ప్రతి పాట, ప్రతి సన్నివేశానికి అనుగుణంగా ఉంటుంది అంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. పాటలకు తగ్గ సాహిత్యాన్ని సమకూర్చిన గేయ రచయితలు కరుణాకర్, కాసర్ల శ్యామ్‌కు అభినందనలు తెలిపారు.

పాటల్ని అందంగా చిత్రీకరించిన సినిమాటోగ్రఫర్ మల్హర్‌భట్‌ను, అద్బుతమైన డ్యాన్స్ ని కంపోజ్ చేసిన మాస్టర్ కిరణ్‌ను డైరెక్టర్ కార్తీకేయ గోపాలకష్ణ ప్రత్యేకంగా ప్రశంసించారు. త్వరలోనే మీ ముందుకు రాబోతున్న లక్ష్మీ బాంబ్ ఆడియోను విని అందరూ ఆనందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ లక్ష్మీబాంబ్ ఆడియో ఇంత త్వరగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సహకరించిన చిత్ర సమర్పకులు గునపాటి సురేష్ రెడ్డి, నిర్మాతలు వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మీ నరసింహలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
![]() |
![]() |