![]() |
![]() |
.jpg)
ఆయన తెలుగు సినిమాను కమర్షియల్ బాట పట్టించిన వేటగాడు..హీరోయిన్ల అందాలను మరింత అందంగా చూపించే పోటుగాడు..మాసైనా, క్లాసైనా, ఫాంటసీయైనా ఆయన టచ్ చేయని ఫార్మాట్ లేదు. ఆయనే దర్శకేంద్రుడు, కె. రాఘవేంద్రరావు. తన ముందు..తనతో పాటు..తన వెనుక వచ్చిన దర్శకులంతా తెరమరుగవుతున్నా నేటికి సినిమాలు తీస్తూ తనలో వాడి ఇంకా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు. తాజాగా కింగ్ నాగార్జునతో మరోసారి భక్తుడి వేషం వేయించి నమో వెంకటేశాయ సినిమాను తీస్తున్నారు. ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే..తన తర్వాతి సినిమా గురించి ప్రణాళికలు రెడీ చేస్తున్నారట. అదేంటంటే తన శిష్యుడు రాజమౌళి బాహుబలి లాంటి విజువల్ వండర్‌ను తీయడంతో తాను కూడా అలాంటి అంశంతోనే సినిమా తీయాలని నిర్ణయించుకున్నారట.
ఈ సినిమాలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకోవాలని అనుకుంటున్నారట దర్శకేంద్రుడు. ఎందుకంటే నేటీ తరంలో గ్రంధికంతో కూడిన డైలాగులు పలకాలంటే ఎన్టీఆర్ తప్ప మరోకరి వల్ల సాధ్యం కాదు. అందుకే తన సినిమాకు ఎన్టీఆర్ అయితే బెటరని రాఘవేంద్రరావు భావన. ఇదిలా ఉంటే దర్శకధీరుడు రాజమౌళి కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కూడా ఎన్టీఆర్ తప్ప తన సినిమాకు ఎవ్వరూ న్యాయం చేయలేరని..ఎన్టీఆర్ లేనిదే నా డ్రీమ్ లేదని జక్కన్న బహిరంగంగానే స్పష్టం చేశాడు. మరి ఈ గురు శిష్యుల్లో జూనియర్ ఎవరికి ఓటు వేస్తారో మరి..?
![]() |
![]() |