![]() |
![]() |
.jpg)
'అందాల రాక్షసి' లావణ్యా త్రిపాఠికి జీవితంపై కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి. 2006లో మిస్ ఉత్తరాఖండ్ టైటిల్ గెలుచుకున్న ఈ సుందరి మంచి డాన్సర్ కూడా. ఆ విషయంలో ఇటీవల 'బొంబాయి' సినిమాలోని "కన్నానులే" కవర్ సాంగ్‌కు చేసిన డాన్స్ ద్వారా మరోసారి నిరూపించుకుంది. లావణ్యలో మంచి తాత్వికురాలు ఉన్న విషయం ఆమెతో ఇంటరాక్ట్ అయిన వాళ్లకు బాగా తెలుసు. లేటెస్ట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆమె పెట్టిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
సెల్‌ఫోన్ స్క్రీన్‌పై తనను తాను చూసుకుంటున్న పిక్చర్‌ను షేర్ చేసిన ఆమె, "ఒక మురికి అద్దంలో నన్ను నేను చూసుకున్నా కూడా, నా నిజమైన ప్రతిబింబాన్ని అదేమీ మార్చలేదు. అదేవిధంగా, ఇతరులు గ్రహించలేనంత మాత్రాన మీలోని సామర్థ్యాన్ని ఎప్పుడూ తక్కువగా భావించవద్దు." అని రాసుకొచ్చింది.
.jpg)
ప్రొఫెషనల్‌గా చూసుకుంటే లావణ్య నటనా సామర్థ్యానికి తగ్గట్లుగా ఆఫర్లు రావడం లేదనేది విశ్లేషకుల మాట. పేరుకు తగ్గట్లే లావణ్యరాసి అయిన ఆమె తన నటనతో ఎంతగా ఆకట్టుకుంటున్నా పెద్ద సినిమాలు, పెద్ద హీరోల నుంచి ప్రోత్సాహం రావట్లేదనే చెప్పాలి. గతేడాది నిఖిల్ జోడీగా 'అర్జున్ సురవరం' సినిమాతో ఆకట్టుకున్న ఆమె, ప్రస్తుతం సందీప్ కిషన్‌తో చేసిన 'ఏ1 ఎక్స్‌ప్రెస్' సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది.
.jpg)
![]() |
![]() |