![]() |
![]() |
.webp)
ఫస్ట్ వీకెండ్ లో జోరు చూపించి.. ఆపై బాక్సాఫీస్ ముంగిట బోల్తా పడ్డ సినిమాలు తెలుగునాట చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో 'ఖుషి' కూడా చేరిపోయిందంటున్నారు ట్రేడ్ పండితులు. సెప్టెంబర్ 1న జనం ముందు నిలిచిన ఈ విజయ్ దేవరకొండ, సమంత స్టారర్.. తొలి మూడు రోజులు మంచి వసూళ్ళు చూసింది. అయితే, సోమవారం నుంచి కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి. వీక్ డేస్ లో రోజు రోజుకి తగ్గుతూ వచ్చిన 'ఖుషి' వసూళ్ళు.. సెకండ్ వీకెండ్ లోనైనా మెరుగవుతాయేమో అనుకుంటే కథ అడ్డం తిరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో శనివారం రూ. 38 లక్షల షేర్ చూసిన 'ఖుషి'.. ఆదివారం రూ. 31 లక్షల షేర్ ఆర్జించింది. ఓవరాల్ గా.. తొలి పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 24. 46 కోట్ల షేర్, ప్రపంచ వ్యాప్తంగా రూ. 40. 10 కోట్ల షేర్ రాబట్టిన 'ఖుషి'.. ఇప్పటివరకు దాదాపు 75 శాతం రికవరీ చూసింది. రూ. 53.50 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన 'ఖుషి'.. ఫుల్ రన్ లో రూ. 10 కోట్లకు పైగా నష్టాలు చూసే అవకాశముందంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
'ఖుషి' 10 రోజుల కలెక్షన్స్ వివరాలు:
నైజాం: రూ.13.28 కోట్ల షేర్
సీడెడ్ : రూ.2.30 కోట్ల షేర్
ఆంధ్రా: రూ.8.98 కోట్ల షేర్
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్స్ : రూ.24.46 కోట్ల షేర్
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా (ఇతర భాషల్లో కలుపుకుని) : రూ.6.86 కోట్ల షేర్
ఓవర్సీస్: రూ.8.78 కోట్ల షేర్
ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల కలెక్షన్స్ : రూ.40.10 కోట్ల షేర్
![]() |
![]() |