Home  »  News  »  అంతా ఆ మహానుభావుడి దయ వల్లనే.. సినిమాలు లేకపోవడంపై సురేష్ కీలక వ్యాఖ్యలు 

Updated : Aug 6, 2026

 

అగ్ర హీరో సినిమా థియేటర్స్ లో ఉన్నప్పుడు సురేష్ సినిమా కూడా రిలీజై సూపర్ హిట్ అయ్యేది. అలాంటి ఎన్నో చిత్రాలు సురేష్ కెరీర్ లో ఉన్నాయి. సెకండ్ ఇన్నింగ్స్ లో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తో మెప్పించినా ఆ తర్వాత ఎక్కువ సినిమాల్లో కనపడలేదు.

 దాదాపు 200 సినిమాల్లో హీరోగా నటించిన ఆయన, ప్రస్తుతం సినిమాలకు కొంత దూరంగా ఉండటంతో టాలీవుడ్‌లో రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. సురేష్ అయిపోయాడు, ఇక సినిమాల్లోకి రాడు, అమెరికా వెళ్లి సెటిల్ అయ్యాడు, ఆయనకు నడుము విరిగింది లేదా మద్రాస్‌లోనే ఉండిపోయాడు అంటూ వ్యాపించిన అనేక వదంతులను ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తీవ్రంగా ఖండించారు.సురేష్ మాట్లాడుతు నేను గత 25 సంవత్సరాలుగా హైదరాబాద్‌లోని మోకిలా ప్రాంతంలోనే ఉంటున్నాను. అచ్చమైన తెలుగువాడినైన నాకు మంచి పాత్రలు ఇచ్చేందుకు దర్శకులు, నిర్మాతలు ముందుకు రావాలి.

మా నాన్న ముఖ దర్శకుడు, నిర్మాత అయినప్పటికీ 1980ల మధ్య కాలంలో తీసిన 'రాముడు పరశురాముడు' చిత్రం వల్ల మా కుటుంబం  తీవ్రమైన ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయింది. అప్పట్లోనే దాదాపు 34 నుంచి 35 లక్షల రూపాయల భారీ అప్పులు నెత్తిన పడ్డాయి. ఆ అప్పులన్నీ తీర్చడానికి ఆరేళ్ల పాటు రాత్రింబవళ్లు నటుడిగా కష్టపడాల్సి వచ్చింది. కేవలం డబ్బు సంపాదించి అప్పులు తీర్చడం కోసమే తన కెరీర్‌కు ఏమాత్రం సంబంధం లేని తమిళ సినిమాల్లో సంవత్సరానికి ఏకంగా 18 చిత్రాల వరకు నటించాల్సి వచ్చింది. కేవలం డబ్బు కోసం నటించే రొటీన్ స్టార్‌గా కాకుండా డస్టిన్ హాఫ్‌మన్, రాబర్ట్ డి నీరో, అల్ పచీనో వంటి దిగ్గజ నటుల తరహాలో వైవిధ్యమైన పాత్రలు చేయాలనేది ఆయన నిరంతర ఆకాంక్ష. కేవలం లవ్ స్టోరీలకే పరిమితం కాకుండా యాక్షన్, థ్రిల్లర్, ఫ్యామిలీ కథలు చేయాలని కోరుకున్నప్పుడు నిర్మాతలు దానికి అంగీకరించలేదు. దాంతో తన కళాత్మక విలువలు, నటనపై ఉన్న గౌరవంతో ఆయన ఏకంగా 11 సినిమాలను తిరస్కరించారు. ఆ సమయంలో నిర్మాణంలో ఉన్న తన స్వంత ఇంటిని కూడా అమ్మేయాల్సి వచ్చింది. ఈ కఠినమైన నిర్ణయాల వల్ల తమిళ చిత్ర పరిశ్రమలో దాదాపు 7 నుండి 8 నెలల పాటు ఎలాంటి పని లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను.


Also read: ఆ విషయంలో డబ్బు సంపాదిస్తే తప్పేంటి.. మల్లికా షెరావత్ సంచలన వ్యాఖ్యలు


అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయంలో దిగ్గజ నిర్మాత డాక్టర్ డి. రామానాయుడు గారిని  కలిశాను.  ఆర్థిక సహాయం కాకుండా కేవలం మంచి నటనకు అవకాశమున్న పాత్ర మాత్రమే కావాలని నిజాయితీగా  అడిగాను. దాంతో  నాయుడు గారు కేవలం 15 నుండి 16 రోజుల్లోనే  'పుట్టింటి పట్టుచీర' సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమా సంచలన విజయం సాధించడమే కాకుండా, పద్మాలయ సంస్థ నుండి 'చిన్నకోడలు', ఉషాకిరణ్ మూవీస్ నుండి 'మామాశ్రీ' చిత్రాల్లో వరుస అవకాశాలు వచ్చాయి . కేవలం 3 నుండి 4 నెలల వ్యవధిలోనే ఆ  మూడు సినిమాలు  బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడంతో నా సినీ కెరీర్  సరికొత్త శిఖరాలకు చేరుకుందని చెప్పుకొచ్చాడు. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.