![]() |
![]() |

మంచు విష్ణు(Vishnu), మోహన్ బాబు(MOhan Babu)ప్రెస్టేజియస్ట్ మూవీ 'కన్నప్ప'(Kannappa). పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కగా, పాన్ ఇండియా లెవల్లో జూన్ 27 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ప్రభాస్(Prabhas)మోహన్ లాల్(MOhanlal), అక్షయ్ కుమార్ (Akshay Kumar)శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి భారీ కాస్టింగ్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
కన్నప్ప సినిమాకి సంబంధించిన కీలకమైన కంటెంట్ ఉన్న ఒక హార్డ్ డ్రైవ్ ముంబై(Mumbai)లోని హెచ్ఐవీఈ(HiVE)స్టూడియోస్ లో ఉంది. రీసెంట్ గా కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్ ని హెచ్ఐవీఈ స్టూడియోస్ హైదరాబాద్(Hyderabad)ఫిలింనగర్ లోని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థకు కొరియర్ ద్వారా పంపించింది. సదరు పార్సిల్ ని ఈ నెల 25న ఆఫీస్ బాయ్ రఘు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత చరిత అనే మహిళతో కలిసి కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్ తో రఘు వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థ అధికారంగా ధ్రువీకరించింది.
కొంతమంది పెద్దవాళ్ళు తమ సినిమాకు నష్టం కలిగించడానికి కుట్ర చేస్తున్నారని, వారిద్దరిని పట్టుకొని చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేసింది. ఇపుడు ఈ విషయం సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారగా, విష్ణు, మోహన్ బాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. కన్నప్ప ని 'మహాభారతం' ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్(Mukeshkumar Singh)దర్శకత్వం వహించాడు. సుమారు 200 కోట్ల బడ్జెట్ తో కన్నప్ప తెరకెక్కింది.
![]() |
![]() |