![]() |
![]() |
.webp)
-లోక చాప్టర్ 1 సృష్టించిన ప్రభంజనం తెలిసిందే
-దీంతో సీక్వెల్ కోసం ఎదురుచూపులు
-ప్రకటన చేసిన చంద్ర
-సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న చర్చ ఇదే
ఈ మధ్య కాలంలో ఉన్నపళంగా స్టార్ హీరోలు, మేకర్స్ చూసిన మూవీ ఏదైనా ఉందంటే 'కొత్త లోక చాప్టర్ 1 '( kotha lokah chapter 1)అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కంటెంట్ పరంగా కూడా చరిత్ర సృషించడమే కాకుండా లిమిటెడ్ బడ్జెట్ తో సిల్వర్ స్క్రీన్ పై వండర్ ని ఎలా సృష్టించవచ్చో చెప్పింది.అంతటి ప్రత్యేకతని నింపుకున్న కొత్త లోక కి సీక్వెల్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో సీక్వెల్ ఎప్పుడెప్పుడు షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని తమ ముందుకు వస్తుందా అని ఆశపడే సినీ ఆశావాహులకి లెక్కే లేదు. ఈ నేపథ్యంలో కొత్త లోక చంద్ర ఇచ్చిన అప్ డేట్ అభిమానుల్లో సంతోషాన్ని నింపుతుంది. తను ఏం చెప్పిందో చూద్దాం.
రీసెంట్ గా చంద్ర మాట్లాడుతు లోక చాప్టర్ 2 కి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. అన్నీ సెట్ అయితే ఈ ఏడాది సెప్టెంబర్ నెల నుంచే షూటింగ్ మొదలు కావచ్చని చెప్పుకొచ్చింది.చాలా రోజుల నుంచి సీక్వెల్ వార్తల గురించి ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి చంద్ర మాటలు అమితానందాన్ని ఇస్తున్నాయి. దీంతో చాప్టర్ 2 ఈ సారి ఎలాంటి కథ, కధనంతో రాబోతుంది. చంద్ర క్యారక్టర్ లో ఎలాంటి వేరియేషన్స్ ని చూపించబోతున్నారనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది.
also read: Chiranjeevi: చిరంజీవి విజయ రహస్యం ప్రతిభ, కష్టం కాదా!.. ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముంది
చంద్ర గా కళ్యాణి ప్రియదర్శన్(kalyani Priyadarshan)అద్భుతమైన పెర్ఫార్మ్ ప్రదర్శించి లేడీ సూపర్ హీరో అనే టాగ్ లైన్ పొందిన విషయం తెలిసిందే. ఇక పార్ట్ 2 లో ఆమెతో పాటుగా టోవినో థామస్, దుల్కర్ సల్మాన్ , మమ్ముట్టి కూడా కనిపించనున్నారు. పార్ట్ 1 ని నిర్మించిన దుల్కర్ నే పార్ట్ 2 ని కూడా నిర్మిస్తున్నాడు.దర్శకుడు డామినిక్ అరుణ్(DomaniC Arun)టేకింగ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. 300 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి మలయాళ సినీ హిస్టరీ ని చెప్పుకునే ప్రతిసారి తనని తప్పనిసరిగా తలుచుకునే అవకాశాన్ని కల్పించిన రికార్డు లోక చాప్టర్ 1 సొంతం. మరి చాప్టర్ 2 ఆ స్థానంలోకి వస్తుందేమో చూడాలి.
.webp)
![]() |
![]() |