![]() |
![]() |

-సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ట్వీట్
-నా జీవితానికి అతిపెద్ద బలం
-నిజమైన కూతురిలా మారావు
-ఫ్యాన్స్ భావోద్వేగం
మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) ప్రస్తుతం సినిమాల పరంగా,వ్యక్తిగత పరంగా మంచి జోష్ లో ఉన్నాడు. తన కెరీర్ తో పాటు రెగ్యులర్ తెలుగు సినిమా హోదాలో మన శంకర వరప్రసాద్ గారుతో బిగ్గెస్ట్ హిట్ ని సాధించగా, కుటుంబ పరంగా మనవడు అడుగుపెట్టాలనే కోరిక కూడా నెరవేరింది.చిరంజీవిని తన ఫ్యామిలీ మెంబర్ గా భావించే అభిమానులు కూడా ఆ రెండు విషయాల్లో చాలా సంతోషంగా ఉన్నారు. అలాంటి ఫ్యాన్స్ ని రీసెంట్ గా చేసిన చిరంజీవి ట్వీట్ భావోద్వేగానికి గురి చేస్తుంది. సదరు ట్వీట్ లో ఏముందో చూద్దాం.
ఈ రోజు చిరంజీవి శ్రీమతి సురేఖ(Surekha)పుట్టినరోజు.ఈ నెల 20 న ఆ ఇద్దరి వివాహం జరిగిన రోజు. దీంతో ఎక్స్ వేదికగా చిరు స్పందిస్తు 'నా ప్రతి అడుగులో నా వెంట నడిచిన సురేఖ కి జన్మదిన శుభాకాంక్షలు. 1980 ఫిబ్రవరి 20న మనం పెళ్లి చేసుకున్న రోజు. నువ్వే నా జీవితానికి అతిపెద్ద బలం. నీ పుట్టినరోజుని జరుపుకుంటు మన వివాహ వార్షికోత్సవాన్ని ముందుగానే గుర్తుచేసుకుంటున్న సందర్భంలో నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. మన కుటుంబానికి నువ్వే కేంద్ర బిందువు. ప్రేమతో అందరినీ కట్టిపడేసే బంధానివి. నా కుటుంబ సభ్యులని నీ వారిలా అంగీకరించావు. ప్రతి సందర్భంలో వారితో నిలబడి, నా తల్లిదండ్రులకు నిజమైన కూతురిలా మారావు. వారు కూడా నిన్ను అంతే ప్రేమతో అంగీకరించారు.ఎవరైనా నా విజయ రహస్యం ఏంటని అడిగితే నా ప్రతిభ, కష్టం కాదు. నువ్వే నా విజయరహస్యం అని చెబుతాను. ప్రతి బాధ్యతని నిశ్శబ్ద బలంతో మోసినందువల్లనే నేను నా వృత్తిపై పూర్తిగా దృష్టి పెట్టగలిగాను. సంక్షోభంలోను, ఆనంద వేడుకలోను మనందరినీ కలిపి ఉంచేది నువ్వే. నా దైర్యం, నా ఆధారం, నా ప్రశాంతత కూడా నువ్వే.
also read: Nithya menen..ఊహించని నిర్ణయం తీసుకున్న నిత్యామీనన్.. కంగ్రాట్స్ చెప్తున్న ఫ్యాన్స్
ఎల్లప్పుడూ, ఎప్పటికీ నా ప్రేమలో అంటూ చిరంజీవి ఎమోషనల్‌గా ట్వీట్ చేశాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానులను భావోద్వేగానికి గురి చేస్తోంది. మెగా అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సురేఖకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan),నాగబాబు (Nagababu)చాలా సందర్భాల్లో తమ జీవితాల్లో ఎదుగుదలకి వదిన సురేఖ కారణం అని చెప్పిన విషయం తెలిసిందే. చిరంజీవి అప్ కమింగ్ సినీ న్యూస్ విషయానికి వస్తే వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబీ దర్శకత్వంలో చేస్తున్న మూవీ త్వరలోనే షూటింగ్ కి వెళ్లనుంది. సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చే అప్ కమింగ్ మూవీ మాత్రం విశ్వంభర. బింబి సార్ ఫేమ్ వశిష్ట దర్శకుడు.

![]() |
![]() |