![]() |
![]() |

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ ఫిల్మ్ 'డెవిల్'. ఇందులో ఆయన బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నాడు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి దర్శకుడు కూడా ఆయనే కావడం విశేషం. ఈ మూవీని నవంబర్ 24న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం వాయిదా పడినట్లు తెలుస్తోంది.
ముందుగా అనుకున్నట్టుగా 'డెవిల్'ను నవంబర్ 24న విడుదల చేయాలనుకుంటే.. ఇంకా మూడు వారాల సమయం మాత్రమే ఉంది. కానీ ఈ మూవీ సీజీ వర్క్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయట. అలాగే సెకండాఫ్ ఆర్ఆర్ కూడా కాలేదట. ఈ చిత్ర సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్.. 'యానిమల్' చిత్రానికి కూడా నేపథ్య సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ 1న విడుదల కానున్న 'యానిమల్'తో ప్రస్తుతం బిజీగా ఉన్న హర్షవర్ధన్.. డెవిల్ సెకండాఫ్ ఆర్ఆర్ వర్క్ చేయాలంటే సమయం పట్టే అవకాశముంది. ఓ వైపు సీజీ వర్క్ పెండింగ్, మరోవైపు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తి కాకపోవడంతో సినిమాని వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించే అవకాశముంది అంటున్నారు.
నవంబర్ 24 మిస్ అయితే డెవిల్ విడుదల ఎప్పుడు ఉంటుందనే ఆసక్తి నెలకొంది. డిసెంబర్ చివరిలో 'సలార్' వస్తోంది. సంక్రాంతిపై 'గుంటూరు కారం' సహా పలు సినిమాలు ఖర్చీఫ్ వేశాయి. ఈ లెక్కన 'డెవిల్' జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
![]() |
![]() |