![]() |
![]() |
.webp)
కన్నడ హీరోయిన్ అయిన రష్మిక ఇప్పుడు నార్త్, సౌత్ అనే తేడా లేకుండా పెద్ద హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా అందరి మన్ననలు పొందుతోంది. చేతినిండా సినిమాలతో యమ బిజీ అయిపోయింది. షిఫ్ట్‌ల పద్ధతిలో కష్టపడుతోంది. ఇటీవల ఈ కన్నడ భామకు ఒక విచిత్రమైన అనుభవం జరిగింది.
ఎప్పుడూ సినిమాలతోనే బిజీగా ఉండే రష్మిక అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వడం కోసం బయటికి వెళ్తూ ఉంటుంది. అలా బయటకు వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌కు రష్మికను ఓ అభిమాని ఆనందం తట్టుకోలేక అందరి ముందూ ఆమె బుగ్గ గిల్లి ముద్దు పెట్టిన ఘటనతో రష్మిక షాక్ అయింది. ఈ ఊహించని పరిణామం తర్వాత రష్మిక సిగ్గుతో తన మొహాన్ని దాచుకుంది. ఇంతకీ రష్మికను చిలిపిగా బుగ్గ గిల్లి ముద్దు పెట్టింది ఎవరో కాదు, ఓ చిన్నారి అభిమాని. ఈ ఘటనకు రష్మిక మొదట షాకైనప్పటికీ తర్వాత ఆ అభిమాని తనపై చూపించిన అభిమానానికి థ్రిల్ అయిపోయింది. రష్మికను చిన్నారి ముద్దు పెట్టుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ పాప ముద్దు పెట్టుకోవడానికి ఎంతో పాజిటివ్‌గా తీసుకున్న రష్మికను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
![]() |
![]() |