![]() |
![]() |

ఉప్పెనతో తెలుగునాట కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. మొదటి సినిమా విడుదల కాకముందే నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్ లోనూ, సుధీర్ బాబు - ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో రూపొందుతున్న కొత్త చిత్రంలోనూ నాయికగా ఎంపికైంది. అలాగే మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులలోనూ కృతి పేరు వినిపించింది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ క్రేజీ వెంచర్ లో కృతి రెండో నాయికగా నటించే అవకాశం దక్కించుకుందని కథనాలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. అరవింద సమేత వంటి విజయవంతమైన చిత్రం తరువాత యంగ్ టైగర్ యన్టీఆర్, సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.
యన్టీఆర్ 30గా తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో సెకండ్ లీడ్ గా కృతి ఎంపికైందని టాలీవుడ్ బజ్. త్వరలోనే తారక్ - త్రివిక్రమ్ సినిమాలో కృతి ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కాగా, యన్టీఆర్ 30ని యన్టీఆర్ ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనుండగా.. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించనున్నారు.
![]() |
![]() |