![]() |
![]() |

నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తోన్న చిత్రంపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు, అభిమానులు అత్యంత ఆసక్తిని కనపరుస్తున్నారు. హిందీ బ్లాక్‌బస్టర్ 'అంధాధున్'కు రీమేక్‌గా శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 11న విడుదల చేయనున్నారు. తమన్నా భాటియా నెగటివ్ రోల్ చేస్తోన్న ఈ చిత్రంలో నితిన్ జోడీగా నభా నటేష్ నటిస్తోంది
మార్చి 30 నితిన్ బర్త్‌డే. ఈ సందర్భంగా అభిమానులకు సంబరాన్ని కలిగిస్తూ చిత్ర బృందం టైటిల్‌ను ప్రకటించడంతో పాటు, నితిన్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. నితిన్ హీరోగా నటిస్తోన్న ఈ 30వ చిత్రానికి 'మాస్ట్రో' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఎనౌన్స్ చేశారు.
దీనికి సంబంధించి నితిన్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో కళ్లకు బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని, చేత్తో ఒక స్టిక్ పట్టుకొని నడుస్తూ అంధునిగా కనిపిస్తున్నారు నితిన్. గమనించాల్సిన విషయమేమంటే ఆయన ఓ పియానోపై నడుస్తున్నట్లుగా ఆ పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఆ పియానోపై రక్తపు మరకలు కనిపిస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
గొప్ప సంగీత విద్వాంసుడిని మాస్ట్రో అంటారు. ఇప్పుడు ఏ అంశంలో గొప్ప నిష్ణాతుడినైనా మాస్ట్రో అనే పిలుస్తున్నారు. ఇదివరకు రిలీజ్ చేసిన రిలీజ్ డేట్ పోస్టర్‌లో పియానో వాయిస్తున్న నితిన్‌ను షాడో రూపంలో మాత్రమే చూపించారు. ఆ పోస్టర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రిలీజ్ చేసిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ మరింత బాగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ఆసక్తికర కాంబినేషన్‌తో తయారవుతున్న 'మాస్ట్రో'పై అభిమానుల అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిని అందుకొనే రీతిలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు మేర్లపాక గాంధీ. 'భీష్మ' మూవీకి సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చిన మహతి స్వరసాగర్ ఈ చిత్రానికీ సుమధుర బాణీలను సమకూరుస్తున్నారు.
అన్నింటికీ మించి, ఇదివరకు ఎప్పుడూ చేయని విలక్షణ పాత్రను ఈ సినిమాలో చేస్తున్నారు నితిన్. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్న ఈ మూవీకి జె. యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.
![]() |
![]() |