![]() |
![]() |

ఎన్టీఆర్, ఆయన ఫ్యాన్స్ మర్చిపోలేని సినిమా దమ్ము. వరుస విజయాలతో మాంఛి జోష్‌లో ఉన్న బోయపాటి .. ఎన్టీఆర్‌తో కలసి తీసిన సినిమా అది. యాక్షన్ డోసు ఎక్కువైన దమ్ము బాక్సాఫీసు దగ్గర తడబడింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో మళ్లీ ఓ సినిమా వస్తోందని టాక్. సరైనోడుతో వంద కోట్ల సినిమా తీసి పెట్టాడు బోయపాటి. తాజాగా ఎన్టీఆర్ కూడా వంద కోట్ల హీరో అయ్యాడు. జనతా గ్యారేజ్ వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ఆ తరవాత ఎలాంటి సినిమా చేయాలా అని ఎన్టీఆర్ ఎదురుచూస్తున్నాడు. కొన్ని కథలు కూడా విన్నాడు. ఈలోగా బోయపాటికీ కబురు పంపినట్టు తెలుస్తోంది. బోయపాటి - ఎన్టీఆర్ లమధ్య ఇటీవలే భేటీ జరిగిందని, వీళ్లిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రావడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే బోయపాటి చేతిలో ఓ సినిమా ఉందిప్పుడు. బెల్లంకొండ శ్రీనివాస్‌తో సినిమాని వచ్చే నెలలో పట్టాలెక్కిస్తారు. సో.. 2016లో ఎన్టీఆర్ - బోయపాటి కాంబినేషన్లో సినిమా రావడం కష్టమే. ఒకవేళ బెల్లంకొండ శ్రీనివాస్ డ్రాప్ అయితే ... ఎన్టీఆర్ - బోయపాటి కాంబినేషన్ పట్టాలెక్కొచ్చు.
![]() |
![]() |