![]() |
![]() |
.jpg)
రాఘవేంద్రరావు శైలి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? బొడ్డు మీద పళ్లు విసరడంలో స్పెషలిస్టు. సినిమా ఏదైనా సరే... తనదైన మార్క్ శృంగారం ఒలికించాల్సిందే. ఆఖరికి అన్నమయ్య, శ్రీరామదాసు సినిమాల్ని సైతం వదల్లేదు. ఆ కథల్లోనూ ఏదోలా... తన శృంగార తృష్టని చూపించుకొన్నారు. ఇహ పాండు రంగడు గురించి చెప్పక్కర్లెద్దు. ఇది భక్తి చిత్రమా? రక్తి చిత్రమా? అంటూ విమర్శకులు కూడా గళమెత్తారు. ఆ స్థాయిలో శృంగారాన్ని ఒలికించేశారాయన. ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న మరో భక్తి చిత్రం ఓ్ం నమో వేంకటేశాయ. ఇందులో కూడా ఆ టైపు సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. హాథీరామ్ బాబా కథని వెండి తెరపై చూపించబోతున్నారు దర్శకేంద్రుడు.
హథీరామ్ బాబా.. వేంకటేశ్వరస్వామి పరమ భక్తుడు. ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలకు కల్పిత గాథని కూడా కలిపి... ఈ సినిమా వండేస్తున్నారాయన. హాథీరామ్‌కి కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా? దాన్ని కూడా తెరపై చూపించబోతున్నారన్నమాట. అనుష్కని ఈ సినిమాలో సన్యాసినిగా చూపించనున్నారు. అయితే ప్రగ్యా జైస్వాల్ పాత్ర మాత్రం హాటు హాటుగా ఉంటుందని సమాచారం. మరి ఈ భక్తి రస ప్రధాన చిత్రంలో దర్శకేంద్రుడు శృంగారాన్ని ఎలా పిండాడో ? ఈ సినిమా చూశాక విమర్శకులు, ముఖ్యంగా వెంకటేశ్వరస్వామి భక్తులు ఎలా స్పందిస్తారో?
![]() |
![]() |