![]() |
![]() |

సిమ్రాన్..అంజలా ఝవేరీ.. ఒక దశాబ్ధం పాలు టాలీవుడ్‌ను ఏలిన అగ్రనటీమణులు. తెలుగులో అందరు అగ్రకథానాయకుల పక్కన నటించడంతో పాటు తమ అందాలతో కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టారు. తర్వాత కాలంలో సిమ్రాన్ దీపక్ అనే వ్యక్తిని..అంజలా ఝవేరీ తరుణ్ అరోరాని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే నటనకు తాము ఫుల్‌స్టాప్ పెట్టేసినా కానీ తమ భర్తల్ని మాత్రం వెండితెరపై ఓ రేంజ్‌లో చూసుకోవాలని భావించిన వీరిద్దరూ ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అంజలా ఝవేరీ తన భర్త తరుణ్ అరోరాకు బంపర్ ఆఫర్ ఇప్పించింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవీ 150వ సినిమాలో విలన్‌గా నటించే ఛాన్స్.
ఇక మరో అందాల తార సిమ్రాన్ కూడా తన భర్తను ఎలాగైనా వెండితెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. దీపక్‌ను హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని ట్రై చేసింది. అయితే అది కుదరలేదు. దీంతో హీరో ఛాన్సుల కోసం టైం వేస్ట్ చేయకుండా విలన్‌గా చూపించబోతోంది. దాని కోసం ఏకంగా తనే ప్రోడ్యూసర్‌గా మారి "ఓడు రాజా ఓడు" చిత్రాన్ని నిర్మిస్తోంది..ఈ సినిమాలో దీపక్ విలన్‌గా నటిస్తున్నాడు. జోకర్ గురు సోమసుందర్ లీడ్ రోల్‌లో కనిపిస్తుండగా నాజర్, చారుహాసన్ ముఖ్యపాత్రలు పోషించారు.
![]() |
![]() |