![]() |
![]() |

ఒకప్పుడు వినోదం కోసం థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు ఇప్పుడు యూట్యూబ్, ఓటీటీల పుణ్యమా అని ఇంట్లో ఉండే కావాల్సినంత వినోదాన్ని పొందుతున్నారు. నేటి యువత చేస్తున్న ఇండిపెండెంట్ ఫిల్మ్ లు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఇటీవల 'తెలుగు వన్' యూట్యూబ్ ఛానల్ లో విడుదలైన ఇండిపెండెంట్ ఫిల్మ్ 'ఫిల్టర్ కాఫీ' కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
అక్టోబర్ 20న విడుదలైన 'ఫిల్టర్ కాఫీ' యూట్యూబ్ లో లక్షల్లో వ్యూస్ సాధిస్తూ దూసుకుపోతోంది. "ప్రేమలో విఫలమైనంత మాత్రాన జీవితం ఆగిపోయినట్లు కాదు", "ఒక్కోసారి మన వాళ్ళ సంతోషం కోసం మన ప్రేమను త్యాగం చేయాల్సి ఉంటుంది" వంటి అద్భుతమైన సందేశాలతో రూపొందిన ఈ ఫీల్ గుడ్ ఫిల్మ్ యువతను మెప్పిస్తోంది. సాయి యశ్వంత్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. అతనికిది తొలి చిత్రమైనా ఎంతో అనుభవం ఉన్నవాడిలా ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ లా ఈ చిత్రాన్ని మలిచాడు. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు ఎడిటర్ కూడా అతనే కావడం విశేషం.
'ఫిల్టర్ కాఫీ'ని అందంగా మలచడంలో దర్శకుడు సాయికి సినిమాటోగ్రాఫర్ శ్రీకాంత్, సంగీత దర్శకుడు దత్తు ప్రధాన బలంగా నిలిచారు. దర్శకుడి ఆలోచనకు తగ్గట్టు శ్రీకాంత్ ప్రతి ఫ్రేమ్ ని ఎంతో అందంగా చిత్రీకరించాడు. ఇక దత్తు సంగీతం ప్రేమ సన్నివేశాలకు ప్రాణం పోసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పాలు, చక్కర, కాఫీ పౌడర్ సరిగ్గా వేసి చేస్తే 'ఫిల్టర్ కాఫీ' ఎంత రుచిగా ఉంటుందో.. అన్ని విభాగాలు సమిష్టి కృషితో చేసిన ఈ 'ఫిల్టర్ కాఫీ' ఫిల్మ్ కూడా అంతే అందంగా ఉందనే అభిప్రాయం కలుగుతుంది.
తారాగణం: చతుర్ణి శ్రీనివాస్, ప్రవణ్, తేజోవికాస్, ప్రభు డుంబో, రాకీ
సినిమాటోగ్రాఫర్: శ్రీకాంత్
సంగీతం: దత్తు
సంభాషణలు: హర్ష
ఎడిటింగ్, స్టొరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: సాయి యశ్వంత్
నిర్మాత: రవిశంకర్ కంఠంనేని
![]() |
![]() |