![]() |
![]() |

'శ్రీ మహాలక్ష్మి' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెర, వెండితెర అన్న తేడా లేకుండా అటు మూవీస్ లో, ఇటు షోస్, ఈవెంట్స్ లో నటిస్తోంది పూర్ణ. అలాంటి పూర్ణకు కొంత కాలం క్రితం ఎంగేజ్మెంట్ అయ్యింది. ఇక ఇప్పుడు అమ్మాయిగారు దుబాయ్ లో పెళ్లిపీటలెక్కింది. ఫామిలీ మెంబెర్స్, రెలిటివ్స్ మధ్యన పూర్ణ, ఆసిఫ్ అలీ సోమవారం నాడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
ఈ సందర్భంగా పూర్ణ తన పెళ్లి ఫోటోలను ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా ఫాన్స్ కోసం షేర్ చేసింది. అంతేకాదు, ఈ పోస్ట్‌లో తన భర్త గురించి కొన్ని అందమైన వాక్యాలను రాసుకుంది. ‘‘ ప్రపంచంలోకెల్లా నేనేమీ అంత అందమైన మహిళను కాకపోవచ్చు. మంచి జీవిత భాగస్వామికి ఉండాల్సిన లక్షణాలు కూడా నాలో లేకపోవచ్చు. కానీ మీరు నేను ఎలా ఉన్నానో అలాగే యాక్సెప్ట్ చేశారు. నన్ను ఆరాధించారు. నన్ను మారమని ఈనాడు చెప్పలేదు. మీరు నన్నెప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు మనకు ఇష్టమైన వారి మధ్య నేను మీతో ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించాను. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు, సందర్భాలు ఎదురైనా సరే.. నేను మీకు అండగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను’’ అంటూ హార్ట్ టచింగ్ లైన్స్ రాసింది పూర్ణ.
ఇక పూర్ణ ఫాన్స్ ఆమెకు విషెస్ చెప్తున్నారు. 'సీమటపాకాయ్' మూవీలో అల్లరి నరేశ్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ.. తర్వాత 'అవును'మూవీ సీరీస్ లో నటించింది. ఐతే పూర్ణకి పెళ్లయిపోయింది కాబట్టి ఇకముందు బుల్లితెర మీద కనిపిస్తుందా లేదా దుబాయ్ లో సెటిల్ ఐపోతుందా అనే విషయాలు తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
![]() |
![]() |