![]() |
![]() |
రామ్ హీరోగా వచ్చిన ‘దేవదాసు’ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైంది ఇలియానా(Ileana D'Cruz). ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్తో ‘పోకిరి’లో మహేష్(mahesh)తో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో రెండో సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత వరస అవకాశాలతో బిజీ హీరోయిన్ అయిపోయింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 30 సినిమాల్లో నటించింది. టాలీవుడ్‌లోని టాప్ హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. 2014 వరకు ఇండియన్‌గా ఉన్న ఇలియానా.. 2014 నుంచి పోర్చుగీస్ పౌరసత్యం తీసుకుంది. 2023లో మైఖేల్ డోలన్‌ను వివాహం చేసుకుంది. వీరికి 2023లోనే ఓ బాబు పుట్టాడు.
ఇదిలా ఉంటే.. ఇలియానాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో తన సినీ జీవితంలో ఎదురైన కొన్ని చేదు అనుభవాలను వివరించింది. మొదట మోడలింగ్, మ్యూజిక్ వీడియోలు చేసిన తను సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చానని తెలిపింది. ఆ సమయంలో తనను లైంగికంగా చాలా మంది వేధించారనే విషయాన్ని బయటపెట్టింది. అందులో టాలీవుడ్ డైరెక్టర్లు కూడా ఉన్నారట. అందులో ఓ డైరెక్టర్ తన కోరిక తీర్చాలంటూ టార్చర్ పెట్టాడని చెప్పింది. అతను చెప్పినట్టు చెయ్యడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యిందట. ఆ సమయంలో తన ఫ్యామిలీ గుర్తు రావడం వల్లే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నానని తెలిపింది. అయితే ఆ డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం చెప్పలేదు. ఇలియానా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలవుతున్నా ఎప్పుడూ ఆ ప్రస్తావన తీసుకురాలేదు. అందుకే ఈ విషయం బయటికి రాలేదు. అయితే లైంగికంగా ఆమెను వేధించిన ఆ డైరెక్టర్ ఎవరు అంటూ ఆసక్తికరమైన కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.
![]() |
![]() |