![]() |
![]() |

ఇండియా వైడ్ గానే కాదు వరల్డ్ వైడ్ గా ఉన్న అన్ని దేశాల్లో చిరంజీవి(chiranjeevi)బర్త్ డే హంగామ ఒక రోజు ముందుగానే స్టార్ట్ అయ్యింది. అభిమానులందరు తమ బాస్ కి అడ్వాన్స్డ్ బర్త్ డే విషెస్ కూడా చెప్తున్నారు.ఇక తాజాగా 100 దేశాల్లో ఉన్న చిరు అభిమానులతో జూమ్ కార్యక్రమం కూడా స్టార్ట్ అయ్యింది. అభిమానులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీస్ అందులో పాల్గొని చిరు తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇక కొన్ని ఏరియాస్ లో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు లైవ్ మారథాన్ కూడా జరగబోతుంది. ఈ కోలాహలం మధ్య చిరు సినిమాలకి సంబంధించిన ఒక ఆసక్తి కర చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది. అది మీ కోసం.
చిరంజీవి నుంచి ఇప్పటి వరకు నూట యాబై ఐదు సినిమాలు వచ్చాయి. ఆ నూట యాబై ఐదు సినిమాల్లో నాలుగు వేల నూట డెబ్భై నాలుగు దుస్తులు ధరించగా ఐదు వందల ఐదు ఫైట్స్ ని చేసాడు. అలాగే తెలుగులో ఐదు వందల డెబ్భై రెండు, హిందీ లో పన్నెండు, కన్నడ లో ఒకటి చొప్పున మొత్తం ఐదు వందల ఎనభై ఐదు సాంగ్స్ కి చిందులేశాడు. ఇప్పుడు ఈ సరికొత్త విషయాలు ఫ్యాన్స్ లో సరికొత్త జోష్ ని తీసుకొస్తున్నాయి.పనిలో పనిగా సోషల్ మీడియాని కూడా ఒక ఊపు ఊపుతున్నాయి. అన్నయ్య ఐతే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి విశ్వంభర(vishwambhara)తో తన సత్తా చాటడానికి సమాయత్తమవుతున్నాడు.
![]() |
![]() |