![]() |
![]() |
KGF చాప్టర్ 1, KGF 2 చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్‌లో మాస్ ఇమేజ్ దక్కించుకున్న హీరో యష్. ఇందులో KGF 2 గత ఏడాది ఏప్రిల్‌లో విడుదలైంది. ఏకంగా రూ.1200 కోట్ల వసూళ్లను కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. యష్ యాక్టింగ్, ప్రశాంత్ నీల్ టేకింగ్ ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేసింది. ఈ మూవీ వచ్చి దాదాపు ఏడాదిన్నర అవుతోంది. కానీ ఇప్పటి వరకు యష్ తన కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. చాలా కథలను ఆయన విన్నారు కానీ.. దేన్ని ఎంపిక చేసుకున్నారనే దానిపై మాత్రం సీక్రెట్‌ను మెయిన్‌టెయిన్ చేస్తూ వస్తున్నారు. ఇది యష్ అభిమానులకు మరింత బాధగా ఉంది. ఎందుకంటే అభిమాన హీరోని స్క్రీన్‌పై చూసుకోవాలని వాళ్లు ఉబలాటపడుతున్నారు మరి.
యష్ నెక్ట్స్ సినిమాపై చాలా వార్తలే నెట్టింట వినిపించాయి. కానీ అవన్నీ వార్తలుగానే ఉండిపోయాయి. యష్ సైతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనే దానిపై నోరు మెదపటం లేదు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి చిత్రంపై ఆసక్తికరమైన వార్తొకటి బయటకు వచ్చింది. ఈసారి రాఖీ భాయ్ లేడీ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నారు. అది కూడా మాఫియా బ్యాగ్రౌండ్‌లోనే కావటం విశేషం. పీరియాడిక్ యాంగిల్‌లోనే ఉంటుంది. నెట్టింట వినిపిస్తోన్న వార్తల మేరకు 1960 దశకం గోవా ప్రాంతంలో డ్రగ్స్ వ్యాపారం ఎలా మొదలైంది. దానిపై ఆధిపత్యం కోసం జరిగిన పోరు ఏంటనే అంశాలతో కూడిన కాన్సెప్ట్‌తో యష్ సినిమా ఉంటుందని అంటున్నారు.
యష్ 19ని డైరెక్ట్ చేయబోతున్న డైరెక్టర్ ఎవరో తెలుసా... లతా మీనన్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ రాజీవ్ మీనన్ సతీమణి అయిన లతా మీనన్ ఈసారి ఏకంగా యష్ వంటి పాన్ ఇండియా హీరోని డైరెక్ట్ చేయబోతుండటం అనేది శాండిల్ వుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
![]() |
![]() |