![]() |
![]() |
మంచు ఫ్యామిలీ హీరో విష్ణు కథానాయకుడిగా తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆ సినిమా మరేదో కాదు.. ‘భక్త కన్నప్ప’. చాలా ఏళ్ల ముందే ఈ సినిమాను చేయబోతున్నట్లు ప్రకటిచారు. అప్పుడు తనికెళ్ల భరణి దర్శకత్వంలో సినిమా ఉంటుందని అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ‘భక్త కన్నప్ప’ను ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కించటానికి విష్ణు అండ్ టీమ్ సన్నాహాలు చేస్తున్నారు. హిందీలో లేటెస్ట్ ‘మహాభారత్’ను తెరకెక్కించిన డైరెక్టర్ ముఖేష్ కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. దీని బడ్జెట్ రూ.150 కోట్లు. న్యూజిలాండ్‌లో సినిమాను చిత్రీకరించబోతున్నారు. ఇప్పటికే సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ‘భక్త కన్నప్ప’కు సంబంధించి ఆసక్తికరమైన వార్తొకటి నెట్టింట వైరల్ అవుతోంది.
‘భక్త కన్నప్ప’ మూవీ విషయంలో నెట్టింట వినిపిస్తోన్న వార్త ఏంటంటే.. విష్ణుతో పాటు ఇందులో రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా నటిస్తున్నారని. నిజంగా ప్రభాస్ నటించటం అంటే చాలా క్రేజీ న్యూసే అని చెప్పాలి. తన ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇస్తే దాని రేంజ్ మారిపోతుందనటంలో సందేహం లేదు. అయితే ఆయన పాత్ర పరిధి ఎలా ఉంటుంది.. ఏ మేరకు ఉంటుంది. ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారనేది కూడా అందరిలోనూ క్యూరియాసిటీని కలిగిస్తోన్న అంశమే. మరి ఈ వార్తలపై విష్ణు మంచు ఎలా స్పందిస్తారో చూడాలి మరి. ప్రభాస్ ఎంట్రీ ఇస్తే ఇది కచ్చితంగా పాన్ ఇండియా మూవీగానే ఉంటుందనటంలో సందేహం లేదు.
విష్ణు గత చిత్రం జిన్నా డిజాస్టర్ అయ్యింది. దాని తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న విష్ణు చాలా సినిమాల గురించి ఆలోచించి చివరకు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భావిస్తోన్న ‘భక్త కన్నప్ప’ను అనౌన్స్ చేసి లాంచ్ చేశారు. నుపూర్ సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంకా ఇందులో ఎవరెవరు నటిస్తారనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
![]() |
![]() |