![]() |
![]() |
.webp)
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘విదాముయర్చి’. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం కొన్నాళ్ళు షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చిన అజిత్ తనకెంతో ఇష్టమైన ట్రావెలింగ్, రైడిరగ్ చేస్తూ బిజీగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం తోటి రైడర్స్, ఫ్రెండ్స్‌తో కలిసి బైక్‌పై మధ్యప్రదేశ్ వెళ్ళారు. మార్గమధ్యంలో స్నేహితుల కోసం ఫుడ్ ఎరేంజ్ చేశారు. ఎరేంజ్ చేయడం అంటే ఫుడ్ తెప్పించడం కాదు, స్వయంగా తనే వండారు అజిత్. ఎవరి సాయం లేకుండా ఒక్కడే బిర్యానీ వండుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
సినిమాలతోపాటు ట్రావెలింగ్, రైడిరగ్.. ఇలా అన్నింటినీ ఎంజాయ్ చేసే అజిత్.. ఫ్యామిలీకి కూడా ఎక్కువ టైమ్ కేటాయిస్తాడు. ఇప్పుడు స్నేహితుల కోసం స్వయంగా బిర్యానీ వండడం స్నేహితులంటే అతనికి ఎంత అభిమానమో తెలియజేస్తుంది. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అజిత్‌ను ప్రశంసిస్తున్నారు. తమ అభిమాన హీరో చేసిన బిర్యానీ చూస్తుంటేనే నోరూరుతోందని కొందరు అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
![]() |
![]() |