Home

»

Latest News

మెగా జాతర.. ఒకేరోజు మూడు సర్ ప్రైజ్ లు!

Mar 21, 2024 4:54PM

'ఆర్ఆర్ఆర్' తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషించిన 'ఆచార్య' ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అలాగే శంకర్ దర్శకత్వంలో చరణ్ హీరోగా నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' బాగా ఆలస్యమైంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ప్రకటించిన సినిమా ఆగిపోయింది. బుచ్చిబాబు ప్రాజెక్ట్ కూడా షూటింగ్ మొదలు కాలేదు. దీంతో చాలా కాలంగా మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే ఇప్పుడు మెగా టైం స్టార్ట్ అయింది. అభిమానులకు వరుస సర్ ప్రైజ్ లను ఇచ్చే పనిలో ఉన్నాడు చరణ్.

మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు. ఆరోజు.. ఒకటి కాదు, రెండు కాదు.. మెగా ఫ్యాన్స్ కి ఏకంగా మూడు సర్ ప్రైజ్ లు ఉన్నట్లు తెలుస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న 'గేమ్ ఛేంజర్' నుంచి మొదటి సాంగ్ 'జరగండి' ఆరోజు విడుదల కానుంది. అలాగే బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ కెరీర్ లో 16వ చిత్రంగా రూపొందనున్న మూవీ టైటిల్ కూడా ఆరోజు రివీల్ చేయనున్నారట. ఈ స్పోర్ట్స్ డ్రామాకి 'పెద్ది' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఈ రెండింటితో పాటు మరో బిగ్ సర్ ప్రైజ్ కూడా రామ్ చరణ్ బర్త్ డేకి ఉందని తెలుస్తోంది. 

రామ్ చరణ్ తన 17వ సినిమాని సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నాడని వినికిడి. గతంలో వీరి కాంబినేషన్ లో 'రంగస్థలం' అనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వచ్చింది. అందుకే వీరి కలయికలో రెండో సినిమా ఎప్పుడొస్తుందా అని చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి ముహూర్తం కుదిరిందని, రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న ప్రకటించనున్నారని న్యూస్ వినిపిస్తోంది. మొత్తానికి ఈ ఏడాది చరణ్ పుట్టినరోజు మెగా అభిమానులకు అసలుసిసలైన పండగ అని చెప్పవచ్చు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com