![]() |
![]() |

అందాల రాక్షసి సినిమాలో నాకు త్వరగా పెళ్లి చెయ్యండి నాన్న అనే డైలాగ్ తో యువకుల కళల రాణిగా మారిన లావణ్య త్రిపాఠి(lavanya tripathi) కొన్ని రోజుల క్రితం మెగా వారి కోడలుగా మారింది. మెగా ప్రిన్స్ వరుణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న లావణ్య తాజాగా ఒక తియ్యటి వార్త చెప్పి అభిమానులని ఆనందంలో ముంచెత్తింది.
లావణ్య త్రిపాఠి కి ఒక సోదరుడు ఉన్నాడు. రీసెంట్ గా అతని భార్య పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. దీంతో తమ త్రిపాఠి వంశానికి వారసుడు పుట్టాడని లావణ్య తన సంతోషాన్ని వ్యక్తం చేస్తు తన ట్విట్టర్ లో బాబు వీడియోని షేర్ చేసింది. అలాగే తన మేనల్లుడు కి కూడా తన లాగానే నవ్వితే బుగ్గ మీద సొట్టలు పడుతున్నాయని కూడా లావణ్య ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవ్వటంతో పాటుగా బాబు చాలా క్యూట్ గా ఉన్నాడని కూడా పలువురు రిప్లైలు ఇస్తున్నారు.
వరుణ్ తో వివాహం తర్వాత లావణ్య సినిమాలకి దూరం అవుతుందని అందరు భావించారు. కానీ లావణ్య మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పెళ్ళికి ముందు ఆమె నటించిన పులి మేక వెబ్ సిరీస్ కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది.
![]() |
![]() |