![]() |
![]() |

'సినిమా బండి' ఫేమ్ వికాష్ వశిష్ట హీరోగా మోక్ష, కుషిత కళ్లపు హీరోయిన్లుగా శ్రీమామిడి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అంజిరామ్ దర్శకత్వంలో ఎమ్.సుధాకర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం 'నీతోనే నేను'. చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ నుంచి ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా 'గురుః బ్రహ్మ గురుః విష్ణు..' లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. గొప్ప సమాజం రూప కల్పనలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం. అందుకనే వారిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోలుస్తుంటారు. అలాంటి టీచర్స్‌కు అంకితమిచ్చేలా 'గురుః బ్రహ్మ గురుః విష్ణు..' పాటను రూపొందించారు. ప్రముఖ సింగర్ మనో పాడిన ఈ పాటను స్టార్ రైటర్ సుద్ధాల అశోక్ తేజ రాశారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎమ్.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ "మంచి సమాజం కావాలంటే మనకు గొప్ప ఉపాధ్యాయులు కావాలి. టీచర్స్ వల్లే అది సాధ్యమవుతుంది. అలాంటి వారి గొప్పతనాన్ని తెలియజేసేలా మా సినిమాలో 'గురుః బ్రహ్మ గురుః విష్ణు..' పాట ఉంది. ఈ పాటను టీచర్స్ డే సందర్భంగా విడుదల చేయటం ఎంతో ఆనందంగా ఉంది. మంచి టీమ్ సపోర్ట్‌తో సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నాం. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేశాను. రామ్ అనే పాత్ర కూడా గవర్నమెంట్ టీచర్. అందులోని లోపాలను సరిదిద్దేక్రమంలో జరిగే కథే 'నీతోనే నేను'. త్వరలోనే సినిమాను రిలీజ్ చేస్తాం. కార్తీక్ గారి సంగీతం అద్భుతంగా ఉంటుంది. మా సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది" అన్నారు.
డైరెక్టర్ అంజి రామ్ మాట్లాడుతూ "టీచర్స్ డే సందర్బంగా మా సినిమా నుంచి 'గురుః బ్రహ్మ గురుః విష్ణు..' పాటను విడుదల చేయటం ఆనందంగా ఉంది. సుద్ధాల అశోక్ తేజగారు రాసిన ఈ పాటను మనోగారు అద్భుతంగా పాడారు. పాట అందరికీ నచ్చుతుంది" అన్నారు.
![]() |
![]() |